సాక్షి, హైదరాబాద్: ఓటర్లుగా పేర్లను నమోదు చేసుకునేందుకు, ఓటర్ల జాబితాలో సవరణలు కోరేందుకు డిసెంబర్ 17 ఆఖరి తేదీ అని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. నగరంలోని ఐమాక్స్‌లో ‘లెట్స్ ఓట్’ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటుచేసిన ఓటరు వెరిఫికేషన్ సెంటర్‌ను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలోని రద్దీగా ఉండే షాపింగ్ మాల్స్‌ల్లో స్వచ్చంధ సంస్థల సహకారంతో మొత్తం 77 వెరిఫికేషన్ సెంటర్లను ఏర్పాటుచేశామని తెలిపారు. ఈ సెంటర్ల వద్దకు ఎవరైనా వచ్చి తమ పేర్లు జాబితాలో ఉన్నాయో లేవో తెలుసుకోవచ్చని, లేనివారు అక్కడే నేరుగా వివరాలు అందించే అవకాశం ఉందని వివరించారు.
కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ స్పెషల్ కమీషనర్ నవీన్‌మిట్టల్, అడిషినల్ కమీషనర్ రోనాల్డ్‌రోజ్, ప్రసాద్ ఐమాక్స్ చైర్మన్ రమేష్ ప్రసాద్, స్వచ్చంద సంస్థల నిర్వాహకులు జే.ఏ.చౌదరి, గీతామారుతి తదితరులు పాల్గొన్నారు.