హజారీబాగ్: జార్ఖండ్‌లోని దారు బ్లాక్‌లోని ఓటర్లు విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వీరు మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు లోక్‌సభ నియోజకవర్గాలకు జరిగే ఎన్నికల్లో ఓటు వేస్తుంటారు. 2008లో బ్లాక్ ఏర్పడినప్పటి నుంచి ఈ అసాధారణ పరిస్థితి ఏర్పడింది. ఈ బ్లాక్‌లో మూడు వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాలకు హజారీబాగ్, బర్కతా, మండు గ్రామాలున్నాయి. దీంతో దారు బ్లాక్‌లోని 42,281 మంది ఓటర్లు ఐదుగురు ప్రజా ప్రతినిధులను ఎన్నుకుంటున్నారు.
హజారీబాగ్ జిల్లాలోని దారు బ్లాక్‌లో తొమ్మిది పంచాయతీలు, 56 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ బ్లాక్ మూడు అసెంబ్లీ నియోజకవర్గాలలో విస్తరించి ఉంది. ఈ కారణంగా ఇక్కడ ఈ ప్రత్యేకమైన ఎన్నికల పరిస్థితి ఏర్పడింది. దారూలోని ఓటర్లు హజారీబాగ్, బర్కథా, మండు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారు. ఇంతేకాదు వీరు హజారీబాగ్, కోడెర్మా లోక్‌సభ నియోజకవర్గాల ఎంపీలను కూడా ఎన్నుకుంటారు.
దారు బ్లాక్‌లోని 42,281 మంది ఓటర్లలో 21,398 మంది పురుషులు, 20,888 మంది మహిళలు ఉన్నారు. ఈ ఎన్నికల్లో తొలిసారిగా 1,272 మంది కొత్త ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తొమ్మిది పంచాయతీలను కలిసి దారు బ్లాక్‌ను రూపొందించినప్పటి నుంచి ఈ విచిత్ర పరిస్థితి ఏర్పడింది. నవంబరు 13న జరిగే పోలింగ్‌కు దారు బ్లాక్‌లోని అన్ని పోలింగ్ స్టేషన్లలో అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.
ఇది కూడా చదవండి: Jharkhand Polls: మెదటి దశలో జేఎంఎం, బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు బరిలో 53 పార్టీలు!
Comments
Please login to add a commentAdd a comment