Jharkhand assembly election
-
Jharkhand Polls: ఐదుగురు ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటున్న ఒక బ్లాక్ ఓటర్లు
హజారీబాగ్: జార్ఖండ్‌లోని దారు బ్లాక్‌లోని ఓటర్లు విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వీరు మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు లోక్‌సభ నియోజకవర్గాలకు జరిగే ఎన్నికల్లో ఓటు వేస్తుంటారు. 2008లో బ్లాక్ ఏర్పడినప్పటి నుంచి ఈ అసాధారణ పరిస్థితి ఏర్పడింది. ఈ బ్లాక్‌లో మూడు వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాలకు హజారీబాగ్, బర్కతా, మండు గ్రామాలున్నాయి. దీంతో దారు బ్లాక్‌లోని 42,281 మంది ఓటర్లు ఐదుగురు ప్రజా ప్రతినిధులను ఎన్నుకుంటున్నారు.హజారీబాగ్ జిల్లాలోని దారు బ్లాక్‌లో తొమ్మిది పంచాయతీలు, 56 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ బ్లాక్ మూడు అసెంబ్లీ నియోజకవర్గాలలో విస్తరించి ఉంది. ఈ కారణంగా ఇక్కడ ఈ ప్రత్యేకమైన ఎన్నికల పరిస్థితి ఏర్పడింది. దారూలోని ఓటర్లు హజారీబాగ్, బర్కథా, మండు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారు. ఇంతేకాదు వీరు హజారీబాగ్, కోడెర్మా లోక్‌సభ నియోజకవర్గాల ఎంపీలను కూడా ఎన్నుకుంటారు.దారు బ్లాక్‌లోని 42,281 మంది ఓటర్లలో 21,398 మంది పురుషులు, 20,888 మంది మహిళలు ఉన్నారు. ఈ ఎన్నికల్లో తొలిసారిగా 1,272 మంది కొత్త ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తొమ్మిది పంచాయతీలను కలిసి దారు బ్లాక్‌ను రూపొందించినప్పటి నుంచి ఈ విచిత్ర పరిస్థితి ఏర్పడింది. నవంబరు 13న జరిగే పోలింగ్‌కు దారు బ్లాక్‌లోని అన్ని పోలింగ్ స్టేషన్లలో అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.ఇది కూడా చదవండి: Jharkhand Polls: మెదటి దశలో జేఎంఎం, బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు బరిలో 53 పార్టీలు! -
ఫోన్‌తో ఎన్నికల ర్యాలీలో ప్రచారం.. ఈసీపై సీఎం సతీమణి ఆగ్రహం
రాంచీ: జార్ఖండ్‌లోని 43 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 13న(రేపు) తొలి విడత పోలింగ్ జరగనుంది. ఈ నేపధ్యంలో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారం ముగించేశాయి. తాజాగా.. సీఎం హేమంత్ సోరెన్ సతీమణి, జేఎంఎం ఎమ్మెల్యే కల్పనా సోరెన్ ఎన్నికల కమిషన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పలు ఆరోపణలు చేశారు. తన ఎన్నికల ప్రచారానికి హెలికాప్టర్‌ను వినియోగించేందుకు ఎన్నికల కమిషన్ అనుమతి నిరాకరించిందని, దీంతో ఫోన్లోనే తాను సభను ఉద్దేశించి ప్రసంగించాల్సి వచ్చిందని ఆమె ఆరోపించారు.పశ్చిమ సింగ్భూమ్ జిల్లా జగన్నాథ్‌పూర్ నియోజకవర్గంలోని మౌలానగర్ మైదానంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఫోన్ ద్వారా ఆమె ప్రసంగిస్తూ.. జార్ఖండ్‌లో జేఎంఎం మళ్లీ అధికారంలోకి రాకుండా ఏ శక్తీ అడ్డుకోలేదని అన్నారు. తాను ఎన్నికల ప్రచారంలో హెలికాప్టర్లను వినియోగించకుండా ఎన్నికల సంఘం అడ్డుకున్నదని ఆమె ఆరోపించారు. బీజేపీని టార్గెట్ చేసిన ఆమె ఆడపిల్లలు చదువుకోవాలని, శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలనేది బీజేపీకి ఇష్టం లేదని ఆరోపించారు. బీజేపీ హయాంలో రాష్ట్రంలో పాఠశాలలను మూసేయడానికి ఇదే కారణమని ఆరోపించారు.బీజేపీ పార్టీ ధనవంతులు, వ్యాపారుల పార్టీ అని కల్పన కల్పనా సోరెన్ అభివర్ణించారు. గిరిజనం అనే పదాన్ని బీజేపీ ద్వేషిస్తుందని, వారి సంస్కృతిని, గుర్తింపును నాశనం చేయాలని బీజేపీ చూస్తున్నదని ఆమె ఆరోపించారు. ఆదివాసీ తెగ 'సర్నా కోడ్'ను బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎందుకు గుర్తించలేదని ఆమె ప్రశ్నించారు. జేఎంఎం-కాంగ్రెస్ కూటమి అభ్యర్థి సోనారామ్ సింకుకు ఓటు వేయాలని కల్పనా సోరెన్ విజ్ఞప్తి చేశారు. అయితే కల్పనా సోరెన్ చేసిన ఆరోపణలపై జార్ఖండ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ రవికుమార్ స్పందిస్తూ ఒడిశా సమీపంలో భారత వైమానిక దళానికి చెందిన విమానాల కదలిక కారణంగా కల్పనా సోరెన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను గంటపాటు ఘట్సిలా వద్ద నిలిపివేసినట్లు తెలిపారు. ఈ ఉదంతంలో ఓ అధికారిని విధుల నుంచి తప్పించినట్లు పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: బైక్ టాక్సీ సేవలను ప్రారంభించిన ఢిల్లీ మెట్రో -
నయా పెట్టుబడిదారుల నుంచి జార్ఖండ్‌ను రక్షించాలి
సాక్షి, హైదరాబాద్: అదానీ, అంబానీ లాంటి నయా పెట్టుబడిదారుల నుంచి జార్ఖండ్ రాష్ట్రానికి విముక్తి కల్పించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. జార్ఖండ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాని ఆయన ప్రజలను కోరారు. ఆదివారం భట్టి జార్ఖండ్‌లోని రాంఘర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి సమావేశం, చిత్తార్పూర్ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో మాట్లాడుతూ, కొద్ది మంది పెట్టుబడిదారుల చేతుల్లో రాష్ట్రాన్ని పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, చైతన్యంగల కాంగ్రెస్ కార్యకర్తలు జార్ఖండ్ రాష్ట్రాన్ని, వనరులను దోపిడీదారుల నుంచి కాపాడాలని పిలుపునిచ్చారు.భారత్ జోడో యాత్రలో భాగంగా దేశంలో విద్వేషం ఉండకూడదని, సంపద అందరికీ సమానంగా పంచాలని రాహుల్ గాంధీ ఇచి్చన సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాలని కోరారు. అన్ని స్థాయిల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించాలని, ఇండియా కూటమి హామీలను, మేనిపెస్టోను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో ఏఐసీసీ నేతలు గులాం అహ్మద్మీర్, సిరివెళ్ల ప్రసాద్, జార్ఖండ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కేశవ్ కమలేశ్ మహతో, మైనార్టీ సెల్ అధ్యక్షుడు తారిఖ్ అన్వర్లతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
జాతీయవాదం పట్టని జార్ఖండ్ ఓటరు..!
జార్ఖండ్‌లో పొందిన అవమానకరమైన ఓటమి కేంద్రంలో పాలక బీజేపీకి గట్టి సందేశాన్నే పంపింది. ఆర్థిక మాంద్యం ఓటర్లపై తన ప్రభావం వేయడం మొదలెట్టిందని, ఓటర్లు కూడు గుడ్డకే ప్రాధాన్యం ఇస్తున్నారని తేలిపోయింది. ఒక చిన్న గిరిజన రాష్ట్రం జార్ఖండ్‌లో సార్వత్రిక ఎన్నికల్లో అఖిల జార్ఖండ్ విద్యార్థుల యూని యన్ (ఏజేఎస్‌యూ)తో పొత్తుపెట్టుకుని పోటీ చేసిన బీజేపీ ఆ రాష్ట్రంలోని 14 ఎంపీ స్థానాలకు గాను 12 స్థానాలు గెల్చుకుని విజయ దుందుభిని మోగించింది. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కూటమి 51 శాతం ఓట్లను సాధించింది. జార్ఖండ్ శాసనసభకు జరిగిన తాజా ఎన్నికల్లో, జార్ఖండ్ ముక్తి మోర్చాతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ చేతిలో బీజేపీ ఘోరపరాజయాన్ని చవిచూసింది. అతి శక్తివంతమైన బీజేపీ ఎన్నికల యంత్రాంగాన్ని ఓడించవచ్చని ఈ ఫలితాలు నిరూపించడమే కాదు.. బీజేపీ బలమే ఇప్పుడు దాని అతిపెద్ద బలహీనతగా మారిపోయిందని స్పష్టమైంది. ప్రత్యేకించి రాష్ట్రాల పరంగా చూస్తే ప్రాంతీయ పార్టీలు ఎన్నికల ముందు లేక ఆ తర్వాత బీజేపీతో సాగిస్తున్న పొత్తును రద్దు చేసుకున్నాయి. జార్ఖండ్ ఎన్నికల్లో ఏజేఎస్‌యూ సాధిం చిన 9 శాతం ఓట్ల షేర్ ఆ రాష్ట్రంలో అధికార మార్పిడికి ప్రధాన కారణమైంది. తమ ఆశల్ని, ఆకాంక్షల్ని తీర్చడంలో విఫలమైన ప్రభుత్వాన్ని ఓటర్లు నిర్దాక్షిణ్యంగా గద్దె నుంచి తప్పిస్తారని, నిత్యావసర అవసరాల విషయానికి వచ్చేసరికి ఓటర్లు ఎలాంటి అపసవ్య విధానాలను సహించబోరని జార్ఖండ్ ఎన్నికలు సందేశం ఇచ్చాయి. దేశంలో అత్యంత ప్రజాదరణ, విశ్వసనీయత కలిగిన నాయకుడిగా ప్రధాని మోదీ ఇప్పటికీ అగ్రస్థానంలో ఉన్నారు. కానీ స్థానిక ప్రభుత్వాలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు, ప్రభుత్వాలపై వ్యతిరేకత ప్రబలిపోయినప్పుడు పార్టీని పైకెత్తడం ప్రధానికి కూడా సాధ్యం కాదని తేలిపోయింది. ఇంతవరకు జార్ఖండ్ సీఎంగా వ్యవహరించిన రఘుబర్ దాస్తోపాటు చాలామంది కేబి నెట్ మంత్రులు కూడా ఓడిపోయారంటే ప్రభుత్వంపై వ్యతిరేకత అంతగా పెరిగిందని అర్థం. స్థానిక అంశాలు, కూటమిలో సమస్యలు బీజేపీ ఓటమికి ప్రధాన కారణం కావచ్చు కానీ, జార్ఖండ్ ఓటర్ తన చుట్టూ జరుగుతున్న పరిణామాలను మర్చిపోయారని చెప్పలేం. ఒకవేళ మర్చిపోయారు అనుకున్నా.. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలు జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో హిందుత్వ ఎజెండాలో పురోగతి, ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు, రామ్ మందిరం, పౌరసత్వ సవరణ చట్టం వంటి తాము సాధించిన ఘనతల గురించి ఓటర్లకు పదేపదే గుర్తు చేస్తూ వచ్చారు. కానీ ప్రజలను విభజించే ప్రయత్నాలకు లొంగని ఓటర్లు తమ తక్షణ సమస్య రోజువారీ జీవిత సమస్యే అని గట్టిగా ప్రకటించారు. ఆర్థిక వ్యవస్థను చక్కదిద్ది దాన్ని తిరిగి పట్టాల మీద నిలబెట్టండి అనేది ఓటరు ఇస్తున్న పెద్ద సందేశం. కాకతాళీయంగా ఎన్నికల ముందు పొత్తు పెట్టుకున్న జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్ పార్టీలు స్థానిక, దైనందిన సమస్యలపట్ల దృష్టి కేంద్రీకరించాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు 2018 నవంబర్‌లో కాంగ్రెస్ మూడు కీలక రాష్ట్రాలను (మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్) గెల్చుకుంది. కానీ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇక్కడే ఘోరంగా దెబ్బతినింది. అయితే ప్రతిపక్షం ఐక్యంగా పనిచేస్తే బీజేపీని ఓడించవచ్చనే వాస్తవాన్ని జార్ఖండ్ మళ్లీ స్పష్టం చేసింది. అయితే దేశవ్యాప్తంగా ప్రభావం చూపే విస్తృత స్థాయి తనకుందనీ, బీజేపీకి తాను ప్రత్యామ్నాయం కాగలననే విశ్వాసాన్ని దేశానికి ప్రతిపక్షం కలిగించగలదా? ఇక బీజేపీ విషయానికి వస్తే జార్ఖండ్ ఫలి తాలు పెనుదెబ్బే అవుతున్నాయి. అది వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిందే. మరికొద్ది నెలల్లో ఢిల్లీలో ఆప్ పార్టీతో, 2021లో పశ్చిమబెంగాల్లో మమతతో బీజేపీ మరో అతిపెద్ద పరీ క్షను ఎదుర్కోనుంది. వ్యాసకర్త : లక్ష్మణ వెంకట్ కూచి, సీనియర్ జర్నలిస్టు -
జార్ఖండ్: తుపాకీతో కాంగ్రెస్ అభ్యర్థి హల్చల్..!
రాంచీ: జార్ఖండ్‌లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం నుంచి ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన పోలింగ్ కొన్ని ప్రాంతాల్లో ఘర్షణకు దారి తీసింది. పోలింగ్ బూతుల వద్ద బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. తోపులాట జరగడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈ సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి గన్ తీసుకొని వచ్చి హల్చల్ చేశాడు. పలామూ నియోజకవర్గంలోని కోసియారా గ్రామంలో ఎన్నికల ప్రక్రియ పరిశీలించేందుకు కాంగ్రెస్ అభ్యర్థి త్రిపాఠీ వచ్చారు. ఆ సమయంలో బీజేపీ అభ్యర్థి అలోక్ చౌరాసియా వర్గీయులు ఆయన్ను అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలకు బీజేపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది. ఆ వెంటనే త్రిపాఠి తన వద్ద ఉన్న గన్ చేతిలోకి తీసుకొని అక్కడి వారిని బెదిరించే ప్రయత్నం చేశారు. పరిస్థితి చేయి దాటడంతో పోలీసులు ఆయన్ను అక్కడి నుంచి పంపించేశారు. గన్ బయటకు తీయడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రిపాఠిపై బీజేపీ నేతలు కూడా విరుచుకుపడ్డారు. నియోజకవర్గంలో ఓటర్లను భయబ్రాంతులకు గురిచేసి ఓట్లు దండుకుంటారా అని ఆరోపించారు. తుపాకీ పట్టుకోవడంతో త్రిపాఠి తన విశ్వసనీయతను కోల్పోయారని బీజేపీ అధికార ప్రతినిధి ప్రతుల్ నాథ్ సహదేవ్ పేర్కొన్నారు. బ్యాలెట్ ఎన్నికలను బుల్లెట్‌తో శాసిస్తారా అని ప్రశ్నించారు. అతనిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను నివేదిక అందజేయాలని ఆదేశాలు జారీచేసింది. -
బీజేపీకి షాక్.. ఒంటరిగానే పోటీ చేస్తాం!
న్యూఢిల్లీ : ఎన్డీయే భాగస్వామి లోక్ జన్‌శక్తి పార్టీ(ఎల్జేపీ) బీజేపీకి షాకిచ్చింది. జార్ఖండ్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీలోకి దిగుతామని స్పష్టం చేసింది. పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయం మేరకు జార్ఖండ్‌లో 50 శాసన సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు పేర్కొంది. ఏ పార్టీతోనూ పొత్తుపెట్టుకోబోమని.. మంగళవారం సాయంత్రం నాటికి మొత్తం అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని తెలిపింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ ట్వీట్ చేశారు. కాగా 81 శాసన సభ స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. నవంబరు 30 నుంచి డిసెంబరు 20 వరకు మొత్తం ఐదు దశల్లో పోలింగ్ జరుగనుంది. ఈ క్రమంలో బీజేపీ ఇప్పటికే 52 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేసింది. ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్ జంషెడ్పూర్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని వెల్లడించింది. కాగా జార్ఖండ్‌లో ఎల్జేపీ ప్రభావం లేకపోయినా మిత్రపక్షానికి వ్యతిరేకంగా పోటీకి దిగడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక కేంద్ర మంత్రి, ఎల్జేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు రామ్‌విలాస్ పాశ్వాన్ తనయుడు చిరాగ్ పాశ్వాన్ ఇటీవలే పార్టీ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. 2014లో ఎన్డీఏ కూటమిలో ఎల్జేపీ చేరడంలో కీలక పాత్ర పోషించిన చిరాగ్.. అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత.. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి 6 సీట్లు కేటాయించాలని బీజేపీకి లేఖ రాసినట్టు వెల్లడించారు. అయితే ప్రస్తుతం పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయం ప్రకారం 50 సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించడం గమనార్హం. కాగా గత ఎన్నికల్లో ఒకే ఒక స్థానంలో పోటీ చేసిన ఎల్జేపీ అక్కడ పరాజయం పాలైంది. झारखंड में चुनाव लड़ने का आख़िरी फ़ैसला प्रदेश इकाई को लेना था।लोक जनशक्ति पार्टी झारखंड प्रदेश इकाई ने यह फ़ैसला लिया है पार्टी 50 सीटों पर अकेले चुनाव लड़ेगी।आज शाम तक पार्टी के उमीदवारों की पहली सूची का एलान हो जाएगा। — Chirag Paswan (@ichiragpaswan) November 12, 2019 -
ప్రతిపక్ష సీఎం అభ్యర్థి ఆయనే
రాంచీ: రానున్న జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా జేఎంఎం వర్కింగ్ ప్రెసిడెంట్ హేమంత్ సోరెన్ ఎంపికయ్యారు. దీనిపై జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), కాంగ్రెస్, రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ)లు ఓ అంగీకారానికి వచ్చాయి. రాష్ట్రంలోని మొత్తం 81 సీట్లకు గాను జేఎంఎం 43, కాంగ్రెస్ 31, ఆర్జేడీ 7 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు ఏఐసీసీ ఇన్చార్జి ఆర్పీఎన్ సింగ్, జేఎంఎం వర్కింగ్ ప్రెసిడెంట్ సోరెన్ వెల్లడించారు. సీట్ల సర్దుబాటుపై ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌తో చర్చించిన తర్వాతే ఖరారు చేస్తామని సోరెన్ తెలిపారు. 81 సీట్లున్న జార్ఖండ్ అసెంబ్లీకి ఈనెల 30వ తేదీ నుంచి ఐదు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆర్జేడీ మద్దతు తీసుకోవడాన్ని హేమంత్ సోరెన్ సమర్థించుకున్నారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను బీజేపీ మోసపూరితంగా అవినీతి కేసుల్లో ఇరికించిందని ఆయన ఆరోపించారు. లాలూ ప్రసాద్‌ను తీవ్రవాదిగా చూస్తోందని వ్యాఖ్యానించారు. తమ కూటమిలోని పార్టీలు ఎక్కడా స్నేహపూర్వక పోటీ చేయడానికి వీలు లేదని, అలా చేస్తే సంకీర్ణం నుంచి బయటికియ వెళ్లిపోవాల్సి ఉంటుందని ఆర్పీఎన్ సింగ్ స్పష్టం చేశారు. -
జార్ఖండ్ లో లాలూ, నితీష్ ప్రచారం
పాట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ కలిసి జార్ఖండ్ లో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. జేడీ(యూ), ఆర్జేడీ, కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఇరువురు అగ్రనాయకులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని బీహార్ శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రావణ్ కుమార్ తెలిపారు. ఈ మూడు పార్టీలు బీజేపీని ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్నాయని చెప్పారు. నవంబర్-డిసెంబర్ లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీహార్ లో 10 అసెంబ్లీ స్థానాలకు ఆగస్టులో జరిగిన ఉప ఎన్నికల్లో లాలూ, నితీష్ కలిసి ప్రచారం చేయగా ఆరు స్థానాలను జేడీ(యూ), ఆర్జేడీ, కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు.