Jharkhand Election 2024: ముగిసిన పోలింగ్‌ | Jharkhand Election 2024 Phase 2 Polling LIVE Updates | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

Jharkhand Election 2024: ముగిసిన పోలింగ్‌

సేవ్‌ జార్ఖండ్‌ లక్ష్యంగా.. : శివరాజ్‌ సింగ్‌

  • జార్ఖండ్‌లో రోటీ భేటీ మాటీ.. సమస్యల్లో ఉన్నాయి
  • ఉద్యోగాల పేరుతో జార్ఖండ్‌ యువతను జేఎంఎం-కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేసింది
  • సేవ్‌ జార్ఖండ్‌ లక్ష్యంగానే ఈ ఎన్నికలు

:::కేంద్ర మంత్రి, జార్ఖండ్‌ బీజేపీ ఎన్నికల ఇంఛార్జి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌

2024-11-20 13:14:32

మీ పిల్లల బలమైన భవిష్యత్తు కోసం ఓటు వేయండి: ప్రియాంక గాంధీ

కాంగ్రెస్ అధినేత్రి ప్రియాంక గాంధీ సోషల్ మీడియా పోస్ట్‌లో జార్ఖండ్ ఓటర్లను ఉద్ధేశించి పోస్టు పెట్టారు

  • మీ కోసం మాత్రమే పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోండి: ప్రియాంక గాంధీ

  • "ప్రియమైన జార్ఖండ్ సోదర సోదరీమణులారా! మీ కోసం, మీ పిల్లల బలమైన భవిష్యత్తు కోసం, నీరు, అటవీ, భూమి రక్షణ కోసం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, సామాజిక న్యాయం, జార్ఖండ్ మంచి భవిష్యత్తు కోసం అందరూ ఓటు హక్కును  ఉపయోగించండి.

  •  మీ కోసం మాత్రమే పని చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు రాజ్యాంగం మీకు ఇచ్చిన అధికారం. ఓటు  హక్కు.

  •  భారీ మెజారిటీతో భారత కూటమినిు గెలిపించండి.

2024-11-20 11:58:00

జార్ఖండ్‌లో 11గంటలకు ఇలా..

  • జార్ఖండ్‌లో  2 ఫేజ్‌ పోలింగ్‌ ముగిసింది
  • సాయంత్రం 5గంటల వరకు 67:59 శాతం పోలింగ్‌ జరిగింది
  • 11గం. కల్లా 31.37శాతం ఓటింగ్‌ జరిగినట్లు వెల్లడించిన ఈసీ
  • ఉదయం 9 గంటల వరకు 12.71 శాతం ఓటింగ్ నమోదైంది.
  • రెండోవిడతలో 38 నియోజకవర్గాలకు పోలింగ్‌
2024-11-20 11:53:00

జార్ఖండ్‌: మళ్లీ జేఎంఎం ప్రభుత్వమే: కల్పనా సోరెన్‌

జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌ కొనసాగుతోంది. 

  • ఎన్నికల ఫలితాల్లో జేఎంఎం తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది: సీఎం సతీమణి కల్పనా సోరెన్‌
  • జార్ఖండ్ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో మహిళలకు వారి గౌరవం దక్కడం ఇదే తొలిసారి.
  • హేమంత్ సోరెన్ ఒక యువ ముఖ్యమంత్రిగా చాలా బాగా పనిచేస్తున్నారు.
  • రాష్ట్రంలో అభివృద్ధి గురించి మాట్లాడటానికి బీజేపీ ఇష్టపడదు.
  • మేమే ఖచ్చితంగా  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం
     
2024-11-20 11:48:36

జార్ఖండ్‌ నేటి పోలింగ్‌ విశేషాలు

  • 12 జిల్లాలు 38 నియోజకవర్గాలు
  • 14,218 పోలింగ్‌ సెంటర్ల ఏర్పాటు
  • 1.23 కోట్ల మంది ఓటు హక్కుకు అర్హత
  • గిరిజన ప్రభావిత ప్రాంతాలు
  • సాయంత్రం 5గం.కే ముగియనున్న పోలింగ్‌
2024-11-20 08:03:18

ఉదయాన్నే బారులు తీరిన ఓటర్లు

  • ఉదయాన్నే బారులు తీరిన ఓటర్లు
  • జార్ఖండ్‌ రెండో విడత పోలింగ్‌కు ఉదయాన్నే బారులు తీరిన జనం
  • డుమ్కా పరిధిలో పోలింగ్‌ సెంటర్ల వద్ద కోలాహలం
  • ఎన్డీయే-ఇండియా మధ్య కీలకపోరు
  • గిరిజన ఓటర్లే ఇక్కడ కీలకం
2024-11-20 07:50:48

38కి 528 మంది పోటీ

  • జార్ఖండ్‌లో మొదలైన రెండో విడత పోలింగ్‌
  • జార్ఖండ్‌లో ఎన్డీయే, ఇండియా కూటముల మధ్య ప్రధాన పోరు
  • 38 స్థానాలకు జరగనున్న పోలింగ్‌
  • రెండో విడతలో బరిలో 528 మంది అభ్యర్థులు
2024-11-20 07:12:10

ప్రారంభమైన పోలింగ్‌

జార్ఖండ్‌లో ప్రారంభమైన పోలింగ్‌

 

2024-11-20 07:03:24

దేశంలో ఎన్నికల కోలాహలం

  • దేశంలో ఇవాళ ఎన్నికల కోలాహలం
  • మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌
  • మహారాష్ట్రలో ఒకే విడతలో ఇవాళ పోలింగ్‌
  • జార్ఖండ్‌లో నేడు రెండో విడత 38 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌
  • మరో నాలుగు రాష్ట్రాల్లోని 15 స్థానాలకు ఉప ఎన్నిక(యూపీలోనే 9).. 90 మంది అభ్యర్థుల పోటీ
  • శనివారం మహారాష్ట్రతో పాటే ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాల వెల్లడి
  • జార్ఖండ్‌లో నవంబర్‌ 13న ముగిసిన తొలి విడత(43 సీట్ల) పోలింగ్‌
2024-11-20 06:59:10

తేల్చేది సంతాల్‌లే!

  • జార్ఖండ్‌ రెండో విడతపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది.
  • ఇవాళ రాష్ట్రంలోని 38 సీట్లలో పోలింగ్‌ జరగనుంది.
  • జార్ఖండ్‌ ముక్తి మోర్చా(JMM)కు ఈ దశ అత్యంత కీలకం
  • ఎందుకంటే.. 38 స్థానాల్లో గిరిజన ప్రాంతాలే అధికంగా ఉన్నాయ్‌
  • గిరిజనుల తీర్పే ఫలితాలను ప్రభావితం చేయనున్నాయి
  • 38లో 18 సంతాల్‌ వర్గాధిక్యంలో ఉన్నాయి
  • పైగా జేఎంఎంకు ఈ ప్రాంతం కంచుకోట కావడం  
  • పైగా ఈసారి రక్త సంబంధీకుల మధ్య పోటీ నెలకొనడం ఆసక్తికరం.
  • గత ఎన్నికల్లో సంతాల్‌ల ప్రాబల్యమున్న 18 సీట్లలో జేఎంఎం 9, కాంగ్రెస్‌ 5 సీట్లు గెలుచుకున్నాయి. బీజేపీ గెల్చింది 4 సీట్లే
2024-11-20 06:51:43

కుటుంబాల పోటీ..

  • ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌.. బర్హైట్‌ నుంచి బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో ఆయన పోటీ చేసిన మరో నియోజకవర్గం దుంకా నుంచి ఈసారీ ఆయన సోదరుడు బసంత్‌ సోరెన్‌ పోటీ చేస్తున్నారు. హేమంత్‌ గతంలో దుంకాను వదులుకోవడంతో బసంత్‌ ఉప ఎన్నికల్లో గెలిచారు.
  • జమాలో హేమంత్‌ వదిన సీతా సోరెన్‌ భాజపా తరఫున బరిలో నిలిచారు. ఆమె ఇటీవలే జేఎంఎం నుంచి భాజపాలోకి మారారు.
  • గాండేయ్‌లో హేమంత్‌ సతీమణి కల్పనా సోరెన్‌ పోటీ చేస్తున్నారు. ఇక్కడ గిరిజనులు, ముస్లింలు కలిపి 40శాతందాకా ఉన్నారు. ఇదే కల్పన బలం.
2024-11-20 06:47:07

జార్ఖండ్‌లో నేడు ఫేజ్‌ 2 పోలింగ్‌..

  • జార్ఖండ్‌లో ఎన్డీయే, ఇండియా కూటముల మధ్య ప్రధాన పోరు జరుగుతోంది.
  • 38 స్థానాలకు జరుగుతున్న రెండో విడతలో 528 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 
  • వారిలో పురుషులు 472, మహిళలు 55, ట్రాన్స్‌జెండర్‌ ఒకరు ఉన్నారు. 
  • 1.23 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
  • 14,218 పోలింగ్‌ బూత్‌లను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది.
2024-11-20 06:45:41
Advertisement
 
Advertisement
 
Advertisement