ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి
జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: అదానీ, అంబానీ లాంటి నయా పెట్టుబడిదారుల నుంచి జార్ఖండ్ రాష్ట్రానికి విముక్తి కల్పించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. జార్ఖండ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాని ఆయన ప్రజలను కోరారు. ఆదివారం భట్టి జార్ఖండ్‌లోని రాంఘర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి సమావేశం, చిత్తార్పూర్ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో మాట్లాడుతూ, కొద్ది మంది పెట్టుబడిదారుల చేతుల్లో రాష్ట్రాన్ని పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, చైతన్యంగల కాంగ్రెస్ కార్యకర్తలు జార్ఖండ్ రాష్ట్రాన్ని, వనరులను దోపిడీదారుల నుంచి కాపాడాలని పిలుపునిచ్చారు.
భారత్ జోడో యాత్రలో భాగంగా దేశంలో విద్వేషం ఉండకూడదని, సంపద అందరికీ సమానంగా పంచాలని రాహుల్ గాంధీ ఇచి్చన సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాలని కోరారు. అన్ని స్థాయిల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించాలని, ఇండియా కూటమి హామీలను, మేనిపెస్టోను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో ఏఐసీసీ నేతలు గులాం అహ్మద్‌మీర్, సిరివెళ్ల ప్రసాద్, జార్ఖండ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కేశవ్ కమలేశ్ మహతో, మైనార్టీ సెల్ అధ్యక్షుడు తారిఖ్ అన్వర్‌లతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment