నల్లగొండ : రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఇంటెన్సివ్ రివిజన్ –2018 చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ సూచించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టడం వల్ల ఒక కుటుంబంలో ఉన్న ఓటర్లు, ఒకే ప్రాంతంలో ఉన్న ఓటర్లందరూ ఒకే పోలింగ్ బూత్‌లో ఓటు వేయడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.
ఇంటెన్సివ్ రివిజన్‌లో నూతనంగా పోలింగ్ ఏరియాలను నిర్ధారించాలని సూచించారు. నవంబర్ 1నుంచి మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో బీఎల్‌ఓలు, ట్యాబ్లెట్ పీసీ ఆపరేటర్లు ఇంటింటికీ వెళ్లి సర్వే చేయాలని సూచిం చారు. ఇంటెన్సివ్ రివిజన్ 2018 చేపట్టే ముందు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, మున్సిపల్ సిబ్బందితో సమావేశం నిర్వహించి సలహాలు, సూచనలు తీసుకోవాలని కోరారు. 01.01.2018ని అర్హత తేదీగా పరిగణిస్తూ ఫొటో ఓటర్ల జాబితా రూపొందించాలని అన్నారు.
01.01.2018 నాటికి 18ఏళ్లు నిండిన వారందరికీ ఫొటో ఓటరు జాబితా తయారు చేయాలని సూచించారు. కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ చేపట్టిన ఇంటెన్సివ్ రివిజన్ నల్లగొండ మున్సిపాల్టీలో పూర్తి చేసినట్లు తెలిపారు. మిర్యాలగూడ మున్సిపాల్టీ, దేవరకొండ నగర పం చాయతీలో ప్రణాళికాబద్ధంగా చేపట్టను న్నట్లు వివరించారు. వీసీలో డీఆర్‌ఓ కీమ్యానాయక్, జెడ్పీ సీఈఓ హనుమానాయక్, నల్లగొండ, దేవరకొండ ఆర్డీఓలు వెంకటాచారి, లింగ్యానాయక్‌పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment