అనంతపురం అర్బన్: రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి బన్వర్‌లాల్ బుధవారం జిల్లాకు విచ్చేస్తున్నారు. ఉదయం 7.30 గంటలకు గుంతకల్లు చేరుకుంటారు. ఎనిమిది గంటలకు కసాపురం చేరుకుని ఆంజనేయస్వామిని దర్శించుకుంటారు. 10.30 గంటలకు అనంతపురం చేరుకుని డీఈఓ, ఈఆర్‌ఓలతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు బయలుదేరి కదిరికి వెళతారు. రెండు గంటలకు అక్కడికి చేరుకుని లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటారు. అనంతరం 3.30 అక్కడి నుంచి తిరుమలకు బయలుదేరి వెళతారు.