హిందూపురం రూరల్ : స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో శనివారం పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల స్థానిక అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. కార్యక్రమానికి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ హాజరు కానున్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం రాత్రే హిందూపురం చేరుకున్నారు. సమీక్ష అనంతరం ఆదివారం కసాపురం సందర్శించనున్నారని తహశీల్దార్ చల్లా విశ్వనాథ్ తెలిపారు.