ఎన్నికల వాయిదా ఉండదు
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్
విభజనతో ఎన్నికలకు సంబంధం లేదు
వచ్చే నెల తొలి వారంలో షెడ్యూలు
రాష్ట్రంలో రెండు లేదా మూడు దశల్లో పోలింగ్
ఎన్నికల సిబ్బంది పక్షపాతం చూపితే కఠిన చర్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనతో ఎన్నికల నిర్వహణకు ఎటువంటి సంబంధం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. విభజన ఎన్నికల ముందు జరుగుతుందా? ఎన్నికల తరువాత జరుగుతుందా? అనేది కమిషన్‌కు సంబంధం లేదని... పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలు, జిల్లాల్లో మార్పులు, చేర్పులు లేనందున ఎన్నికల వాయిదాకు అవకాశం లేదని ఆయన తెలిపారు. రాష్ట్రంలో అసెంబ్లీకి, లోక్‌సభకు షెడ్యూల్ మేరకే ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. ఎన్నికల అధికారుల బదిలీలు, అధికారుల పోస్టింగ్‌లపై భన్వర్‌లాల్ శనివారం జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే...
్హ వచ్చే నెల తొలివారంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. రాష్ట్రంలో రెండు లేదా మూడు దశల్లో పోలింగ్ జరగవచ్చు.
్హ ఇటీవల కేంద్ర ఎన్నికల కమిషన్ అన్ని రాష్ట్రాల సీఎస్, డీజీపీ, సీఈవోలతో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించింది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని, ఎటువంటి సమస్యలు లేవని ఆ సమీక్షలో స్పష్టం చేశాం.
్హ ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, ఉద్యోగులు తటస్థంగా ఉండాలి. ఎవరైనా పక్షపాతంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటారుు.
్హ కొన్ని గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలపై ఓట్ల కోసం దౌర్జన్యం, ఒత్తిడి చేసే ఘటనలు జరిగే అవకాశముంది. అలాంటి గ్రామాల్లో ఓటర్లను, దౌర్జన్యం, ఒత్తిడి చేసే వ్యక్తులను గుర్తించి.. వారిపై చర్యలు తీసుకుంటాం.
్హ ఎవరి ఒత్తిడికి లొంగకుండా స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణం కల్పిస్తాం.
్హ వేసవిలో ఎన్నికలు జరగనున్నందున ప్రతి పోలింగ్ కేంద్రంలో కనీస సౌకర్యాలు కల్పిస్తాం. మంచినీరు, టాయిలెట్, విద్యుత్ సౌకర్యాలతో పాటు వికలాంగుల కోసం ర్యాంపు ఏర్పాటు చేస్తాం.
్హ ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో డబ్బు పంపిణీ అధికంగా ఉండే అవకాశమున్నందున.. దాన్ని నిరోధించడానికి నిఘాను మరింత పటిష్టం చేస్తున్నాం.
్హ రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు 1.89 లక్షల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు అవసరం. మూడు లక్షల యంత్రాలు కొత్తగా వస్తున్నారుు. హైదరాబాద్‌లోని ఈసీఐఎల్, బెంగళూరులోని బెల్, మహారాష్ట్ర నుంచి యంత్రాలు రానున్నారుు.
్హ ఎన్నికల సంబంధ బదిలీలు 95 శాతం పూర్తయ్యూరుు. మిగతా ఐదు శాతం సోమవారానికి పూర్తి అవుతారుు.
నేతలపై కేసుల గురించి ఆరా!
ఎన్నికల కమిషన్ ఆదేశాలతో కదిలిన పోలీసుశాఖ
రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులలో ఎవరెవరిపై ఏయే కేసులున్నాయనే సమాచారాన్ని పోలీసు శాఖ సేకరిస్తోంది. ఇందులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మాజీ ప్రజా ప్రతినిధుల వివరాలను పోలీసు అధికారులు సేకరిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ సమాచారాన్ని సేకరించి పోలీసు ప్రధాన కార్యాలయానికి పంపాల్సిందిగా డీజీపీ బి.ప్రసాదరావు నగర పోలీసు కమిషనర్లు, జిల్లాల ఎస్పీలను ఆదేశించారు. ఈ మేరకు సమాచారాన్ని సేకరించే బాధ్యతను జిల్లాల్లో డీఎస్పీలకు, కమిషనరేట్లలో ఏసీపీలకు అప్పగించారు. ఇందులో ఇప్పటికే చాలా మంది వివరాలను అధికారులు సేకరించి, పై అధికారులకు అందజేసినట్లు సమాచారం. మిగతా వివరాలను కూడా ఒకటి రెండు రోజుల్లో సేకరించి... పూర్తి నివేదికను ఎన్నికల సంఘానికి అందజేయనున్నట్లు తెలిసింది.