
న్యూఢిల్లీ: íఇటీవల ముగిసిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న ఒకే రోజు మొదలవుతుందని ఎన్నికల కమిషన్(ఈసీ) ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, మిజోరంలో మాత్రం ఒక రోజు ఆలస్యంగా డిసెంబర్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు శుక్రవారం ఈసీ తెలిపింది. క్రైస్తవులు మెజారిటీ కలిగిన ఈ రాష్ట్రానికి చెందిన వివిధ వర్గాల ప్రతినిధులు 3వ తేదీ, ఆదివారం తమకు ఎంతో ప్రత్యేకమైనది అయినందున ఓట్ల లెక్కింపు వాయిదా వేయాలని కోరినట్లు ఈసీ వెల్లడించింది. ఈ మేరకు కౌంటింగ్‌ను ఒక రోజు అంటే 4వ తేదీకి వాయిదా వేసినట్లు వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment