
కోడ్ ముగిసింది: భన్వర్‌లాల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల కోడ్ ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ వెల్లడించారు. స్థాని క సంస్థల ఎన్నికల ప్రక్రియ ముగియటంతో బుధవారం సాయంత్రం నుంచి కోడ్ నిబంధనలు తొలిగినట్లేనని చెప్పారు. స్థానిక కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మొత్తం పన్నెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పది స్థానాలు, కాంగ్రెస్ రెండు స్థానాల్లో గెలుపొందినట్లు ప్రకటించారు.
ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్‌లో రెండు స్థానాలు, మెదక్, వరంగల్ జిల్లాల్లో ఒక్కరొక్కరే అభ్యర్థులు పోటీలో ఉండటంతో ఏకగీవ్రమైనట్లుగా విజేతలను ప్రకటించినట్లు చెప్పారు. రంగారెడ్డి జిల్లాలో రెండు స్థానాలు, మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు స్థానాలు, నల్లగొండ, ఖమ్మం స్థానాలకు పోలింగ్ జరిగిందన్నారు. ఎన్నికలు జరిగిన ఆరు స్థానాల్లో 25 ఓట్లు చెల్లనివి ఉన్నట్లు గుర్తించి వాటిని తిరస్కరించినట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో 13, నల్లగొండలో 6, మహబూబ్‌నగర్‌లో 4, ఖమ్మంలో 2 చెల్లని ఓట్లున్నట్లు చెప్పారు.
త్వరలో నారాయణఖేడ్ ఉప ఎన్నిక:
నారాయణఖేడ్ ఎమ్మెల్యే స్థానానికి నిర్వహించనున్న ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని భన్వర్‌లాల్ చెప్పారు. ఎన్నికల కమిషన్ నిర్ణయం మేరకు త్వరలోనే నోటిఫికేషన్ వెలువడుతుందని అన్నారు. ఫిబ్రవరి 25లోగా ఈ ఎన్నిక జరగాల్సి ఉందని చెప్పారు
ఏకగ్రీవమైన స్థానాలు: విజేతలు
ఆదిలాబాద్: పురాణం సతీష్(టీఆర్‌ఎస్)
నిజామాబాద్: భూపతి రెడ్డి(టీఆర్‌ఎస్)
కరీంనగర్: నారదాసు లక్ష్మణ్‌రావు(టీఆర్‌ఎస్), టి.భానుప్రసాద్‌రావు (టీఆర్‌ఎస్)
మెదక్: వి.భూపాల్‌రెడ్డి (టీఆర్‌ఎస్)
వరంగల్: కె. మురళీధర్ర్రావు (టీఆర్‌ఎస్)
ఓటింగ్ జరిగిన స్థానాలు: విజేతలు
రంగారెడ్డి: పట్నం నరేందర్‌రెడ్డి
(టీఆర్‌ఎస్), శంభీపూర్ రాజు(టీఆర్‌ఎస్)
మహబూబ్‌నగర్: కసిరెడ్డి నారాయణరెడ్డి (టీఆర్‌ఎస్) కె.దామోదర్‌రెడ్డి(కాంగ్రెస్)
నల్లగొండ: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (కాంగ్రెస్)
ఖమ్మం: బాలసాని లక్ష్మీనారాయణ (టీఆర్‌ఎస్)