
నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదన లేదు
కాంగ్రెస్ నేతకు ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ లేఖ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదన ఏదీ లేదని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే 9 జిల్లాల్లో ఉన్న డెల్టా ప్రాంతాల్లోని గిరిజనులకు ఎమ్మెల్యే, ఎంపీ సీట్లలో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, ట్రైఫెడ్ మాజీ చైర్మన్ ఎం.సూర్యానాయక్ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి ఇటీవల లేఖ రాశారు.
దీనికి ఎన్నికల అధికారి.. ప్రస్తుతానికి పునర్విభజన ప్రతిపాదన ఏదీ లేదని, భవిష్యత్తులో అలాంటిదేమైనా ఉంటే రిజర్వేషన్ల ప్రక్రియను పరిశీలిస్తామని సూర్యానాయక్‌కు లిఖిత పూర్వకంగా తెలియజేశారు.