వరంగల్ పార్లమెంట్ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో వామపక్షాల అభ్యర్థిగా బరిలో దిగిన తాను ఎవరెవరితో మాట్లాడుతున్నానో...
- వామపక్షాల అభ్యర్థి వినోద్‌కుమార్
పరకాల(వరంగల్): వరంగల్ పార్లమెంట్ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో వామపక్షాల అభ్యర్థిగా బరిలో దిగిన తాను ఎవరెవరితో మాట్లాడుతున్నానో తెలుసుకునేందుకు సీఎం కేసీఆర్ తన ఫోన్‌ను ట్యాపింగ్ చేస్తున్నారని ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ ఆరోపించారు. వరంగల్ జిల్లా పరకాలలో శనివారం జరిగిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ వరంగల్ ఉప ఎన్నికల్లో బలమైన అభ్యర్థిని కావడంతో తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారన్నారు.
చిన్నతనంలోనే తండ్రి మరణించగా తన తల్లి కూలీకి వెళ్తూ కుటుంబాన్ని పోషించిందని.. పశువుల కాపరి నుంచి ప్రొఫెసర్ స్థాయికి ఆపై ప్రిన్సిపాల్ కాగలిగానని తెలిపారు. ఉప ఎన్నికల బరిలోకి దిగుతున్న మిగతా పార్టీల అభ్యర్థులకు వేల కోట్ల ఆస్తులు ఉన్నా... తనపై మాత్రం తెలంగాణ ఉద్యమ సమయం నాటి వందల కేసులు ఉన్నాయంటూ వినోద్‌కుమార్ కన్నీటి పర్యంతమయ్యారు.