మేయర్ ఎన్నికను ఆపివేయాలి: కాంగ్రెస్ | GHMC mayor selection will stop for some time, Tcongress | Sakshi
Sakshi News home page

మేయర్ ఎన్నికను ఆపివేయాలి: కాంగ్రెస్

Published Wed, Feb 10 2016 5:11 PM | Last Updated on Tue, Aug 14 2018 4:34 PM

మేయర్ ఎన్నికను ఆపివేయాలి: కాంగ్రెస్ - Sakshi

మేయర్ ఎన్నికను ఆపివేయాలి: కాంగ్రెస్

హైదరాబాద్:  గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలను తాత్కాలికంగా ఆపివేయాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు  రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డిని కోరారు. బుధవారం సాయంత్రం టీకాంగ్రెస్ నేతలు ఎలక్షన్ కమిషనర్ ను కలిశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చాలా అవకతవకలు జరిగాయని నేతలు ఆరోపించారు.

ఈ నెల 5న జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎం లలో అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికల్లో జరిగిన అక్రమాలు వెల్లడయ్యే వరకు రేపు జరగనున్న ఎన్నికను ఆపాలని టీకాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డికి విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement