రైతులపై కుట్ర కేసులా..?
► వారిని సంఘ వ్యతిరేక శక్తులుగా ముద్ర వేస్తారా?
► ఖమ్మం మార్కెట్‌ను సందర్శించిన సీఎల్పీ నేత జానారెడ్డి
సాక్షి, ఖమ్మం: ‘‘మిర్చిని అమ్ముకోవడానికి రైతులు మార్కెట్‌కు తెచ్చారు.. ధర లేదని ఆవేశంతో రైతులు ఆందోళన చేస్తే ప్రభుత్వా న్ని కూల్చేందుకు కుట్ర చేశారని కేసులు పెడ తారా’’అంటూ కాంగ్రెస్ శాసనసభా పక్షనేత కుందూరు జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన ఖమ్మం మార్కెట్‌ను సం దర్శించారు. తర్వాత మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్‌జేసీ కృష్ణ, కార్యదర్శి ప్రసాదరావుతో ఘటన జరిగిన తీరుపై మాట్లాడారు. ఈ సం దర్భంగా కాంగ్రెస్ నేత లు, మార్కెట్ కమిటీ చైర్మన్ మధ్య వాగ్వాదం జరిగింది.
అనం తరం ఖమ్మం మార్కెట్‌పై దాడి ఘటనలో అరెస్టయి ఖమ్మం జిల్లా జైలులో ఉన్న రైతు లను కాంగ్రెస్ నేతలు కె. జానారెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ వి. హనుమంతరావు తదితరు లు సోమవారం పరామర్శించా రు. జానారెడ్డి విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం పంట లకు గిట్టుబాటు ధర ఇవ్వా ల్సిందిపోయి రైతులపట్ల అహం కారంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
రైతులను సంఘ వ్యతిరేక శక్తులుగా ముద్రవేసి జైల్లో పెట్టించిందని, తాము బాధిత కుటుంబాలతో మాట్లాడితే వారు రైతులేనని తేలిందన్నారు. రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు. కొందరు వ్యా పారులు టీఆర్‌ఎస్‌లో చేరిన తర్వాత రైతు లను దోచుకుంటున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
రాష్ట్రంలో రాక్షస పాలన: సీతక్క
రాష్ట్రంలో రాక్షసపాలన నడుస్తోందని టీడీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సీతక్క అన్నారు. జైలు లో ఉన్న రైతులను ఆమె పరామర్శించారు.