సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి ఇక ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్‌బై చెప్పినట్లేనా?. ఎప్పటి నుంచో తన వారసుల్ని రాజకీయాల్లోకి తీసుకురావాలని కలలు కంటున్న జానారెడ్డి.. ఆ వ్యూహంలో భాగంగా తన చిన్న కుమారుడిని రంగంలోకి దించారు. నాగార్జున సాగర్ నుంచి జానారెడ్డి చిన్న కొడుకు జైవీర్ రెడ్డి పోటీ కోసం దరఖాస్తు చేసుకోవడంతో.. ఈసారి ఎన్నికలకు జానారెడ్డి దూరమైనట్లే భావించొచ్చు.
చిన్న కుమారుడు జైవీర్ రెడ్డి గిరిజన చైతన్య యాత్ర పేరుతో జనాల్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. పెద్దవూర మండలం గేమ్యా నాయక్ తండా నుంచి పాదయాత్రను మొదలు పెట్టిన జైవీర్రెడ్డి.. తనతండ్రి జానారెడ్డి హయాంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ సాగారు. అయితే.. ఉన్నట్లుండి జైవీర్ రంగంలోకి రావడం వెనుక భారీ వ్యూహమే ఉందని తెలుస్తోంది.
గతంలో గిరిజన తండాలు కాంగ్రెస్‌కు పెట్టని కోటలా ఉండేవి. కానీ కేసీఆర్ ప్రభుత్వం చిన్న చిన్న తండాలను కూడా గ్రామ పంచాయితీలుగా మార్చడంతో మెజార్టీ తండాల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే సర్పంచులుగా ఉన్నారు. దీంతో గిరిజనుల మద్దతును మరోసారి కూడగట్టేందుకు యాత్రను ఉపయోగించుకుంటున్నారని టాక్.
కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థుల దరఖాస్తుకు రేపే ఆఖరి రోజు. పీసీసీకి ఇప్పటిదాకా 600 అప్లికేషన్లు వచ్చాయి. ఇవాళ రేవంత్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య దరఖాస్తు చేసుకోగా.. పొంగులేటి, కొమటిరెడ్డి, కొండాసురేఖలు ఇప్పటికే అప్లికేషన్లు సమర్పించారు. ఉత్తమ్, భట్టి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.
చదవండి: గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణను ప్రకటించిన హైకోర్టు
Comments
Please login to add a commentAdd a comment