బంగారు తెలంగాణ అంటే అప్పులేనా?
- టీఆర్‌ఎస్ వచ్చాక రూ. 2 లక్షల కోట్లకు చేరిన అప్పులు
- అభివృద్ధి పేరిట అప్పులు చేస్తున్న కేసీఆర్ సీఎంగా అర్హుడు కాదు
- సీఎల్పీ నేత కె.జానారెడ్డి విమర్శలు
బీబీనగర్ (భువనగిరి)/యాదగిరికొండ (ఆలేరు): బంగారు తెలంగాణ పేరుతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇష్టాను సారంగా అప్పులు తెస్తోందని, మున్ముందు రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చే ప్రమాదముందని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత కె.జానారెడ్డి విమర్శించారు. యాదా ద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌తో పాటు వెంకిర్యాల, రాఘ వాపురంల్లోని చెరువులను బుధవారం సందర్శించారు. వాటిలో ప్రభుత్వం వేయించిన చేపలను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి ఉన్న అప్పులు రూ. 2 లక్షల కోట్లకు చేరాయన్నారు. అభివృద్ధి పేరుతో అప్పులు చేస్తున్న కేసీఆర్ సీఎంగా అర్హుడు కాదన్నారు.
రైతు రుణమాఫీ కింద వడ్డీ కూడా కలిపి ఇస్తామని చెప్పిన ప్రభు త్వం ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని జానారెడ్డి అన్నారు. ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చ రించారు. 2019లో బాలాలయంలోని స్వామి, అమ్మవార్ల సన్నిధిలో జానారెడ్డి తన మనవరాలికి అన్నప్రాసన చేయించేందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లా డారు. ప్రాజెక్టులను అడ్డుకో వడం మా అభిమతం కాదని, బాధితులకు తగిన న్యాయం చేయాలన్నారు.