కేసీఆర్‌ను ఓడించేందుకు బాహుబలి వస్తాడేమో! | “Bahubali” will come to resurrect Congress in State: Jana Reddy | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ను ఓడించేందుకు బాహుబలి వస్తాడేమో!

Published Sat, Mar 18 2017 2:39 AM | Last Updated on Wed, Aug 15 2018 9:37 PM

కేసీఆర్‌ను ఓడించేందుకు బాహుబలి వస్తాడేమో! - Sakshi

కేసీఆర్‌ను ఓడించేందుకు బాహుబలి వస్తాడేమో!

ఆయన తలరాత ఎలా ఉందో నాకేం తెలుసు: జానారెడ్డి
ఎన్నికల నాటికి కూడా డబుల్‌బెడ్‌రూం ఇళ్లు పూర్తికావు
నమూనాగా కొన్ని కట్టినా లబ్ధిదారులకు ఇవ్వరు
వాటినే చూపించి జనాన్ని మభ్యపెడతారు
మంత్రులెందరో తనతో బాధలు చెబుతుంటారని వ్యాఖ్య


సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఏడాదికి డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెబుతు న్నా.. ఎన్నికల నాటికి కూడా పూర్తి చేయరని ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి అన్నారు. నమూనా గా కొన్ని ఇళ్లు పూర్తిచేసినా వాటిని లబ్ధిదారుల కు కేటాయించరని పేర్కొన్నారు. పార్టీ ఎమ్మె ల్యేలు టి.జీవన్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డితో కలసి అసెంబ్లీలోని తన చాంబర్‌లో శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ను ఓడించడానికి, కేసీ ఆర్‌ను ఎన్నికల్లో కొట్టడానికి రాష్ట్రంలోనూ ఒక బాహుబలి వస్తాడేమోనని వ్యాఖ్యానించారు. ‘‘సీఎం కేసీఆర్‌ తలరాత ఎలా ఉందో నాకేం తెలుసు? అది పైన ఉన్నోడికి తెలుస్తుంది. పైన అంటే టీఆర్‌ఎస్‌ఎల్‌పీ కార్యాలయంలోని హరీ శ్‌రావుకు కాదు. పైన అంటే ఆ దేవుడికి అని నా ఉద్దేశం..’’ అని జానా అన్నారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు పూర్తి చేయడానికి ప్రభుత్వం ఇబ్బందులు పడుతోందని చెప్పారు.

ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలంటూ పెద్దపెద్ద కాం ట్రాక్టర్లను బలవంతంగా తీసుకువస్తున్నారని, అయినా ఎన్నికలనాటికి కూడా పూర్తి చేయ కుండా నాన్చుతారని చెప్పారు. ‘‘అక్కడక్కడా పూర్తి చేసిన కొన్ని ఇళ్లను నమూనాగా (మోడల్‌) గా చూపి.. మళ్లీ అధికారంలోకి వస్తే ఇస్తామని మభ్యపెడతారు. పూర్తి చేసిన ఇళ్లను కూడా లబ్ధి దారులకు కేటాయించకుండా ఎన్నికలను దాటే యడానికి కేసీఆర్‌ ప్రయత్ని స్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నమ్మిన ప్రజలు తమకు ఇళ్లు వస్తాయని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వాళ్లు చెబుతున్న మాటలు కూడా ఇంకా నమ్మ కాన్ని నిలబెడుతున్నాయి. వాటిని పూర్తి చేయ డం సాధ్యం కాదని అందరికీ తెలుసు. అయితే నా ఒక్కడికైనా రాక పోతుందా అని ఎవరికి వారు ఆశల పల్లకిలో ఉన్నారు.

ఈ విషయం ప్రజలకు చెప్పినా అర్థం కాదు. టీఆర్‌ఎస్‌ వాళ్లు ఇస్తామంటుంటే జానారెడ్డి అడ్డం పడుతు న్నడని అనుమానించే ప్రమాదం ఉంది. సరే వాళ్లు ఎన్నికల నాటికి పూర్తి చేయనీ.. ప్రజలకు వాస్తవాలు అర్థంకానీ.. అని ఓపిక పడుతు న్నాం. ఒక ఊరిలో వందమంది ఆశప డుతుంటే 20 ఇళ్లు కూడా పూర్తి చేసే పరి స్థితి లేదు. భూమి దొరికిన ప్రాంతాల్లో కొన్నింటిని పూర్తి చేసి నట్టుగా చూపి, మిగతా చోట్ల ఎన్నికలైన తర్వాత ఇస్తామంటారు. లబ్ధిదారులకు కేటా యిస్తే.. ఇళ్లు రాని వాళ్లు వ్యతిరేకం అవుతారని టీఆర్‌ఎస్‌ వాళ్లకు తెలుసు. అందుకే లబ్ధిదా రులకు కూడా ఇవ్వకుండా అందరినీ ఆశల్లో ఉంచుతారు’’ అని జానారెడ్డి వివరించారు.

విద్యుత్‌ రంగాన్ని అస్తవ్యస్తం చేస్తున్నారు
రాష్ట్రంలో విద్యుత్‌ రంగాన్ని టీఆర్‌ఎస్‌ అస్తవ్యస్తం చేస్తోందని, దీనివల్ల భవిష్యత్‌లో విద్యుత్‌ సంస్థలు తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోతాయని జానారెడ్డి హెచ్చరించారు. ఏడాదికి డిస్కంలకు రూ.10 వేల కోట్లు లోటుందన్నారు. ఇందులో రూ.4 వేల కోట్లు మాత్రమే ప్రభుత్వం ఇస్తోందని, మిగిలిన రూ.6 వేల కోట్లు డిస్కంలు ఎలా భరిస్తాయని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అవగాహన, ముందుచూపు లేకపోవడం వల్ల ఛత్తీస్‌గఢ్‌కు, పవర్‌గ్రిడ్‌కు అనివార్యంగా కొన్ని వృథా చెల్లింపులు ఉంటాయన్నారు. ఇలాంటివన్నీ ప్రజలపై పెనుభారంగా మారతాయన్నారు.

మంత్రులు కూడా సంతోషంగా లేరు
టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీలోని ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా సంతోషంగా లేరని జానారెడ్డి పేర్కొన్నారు. ‘‘రాజ కీయాల్లో నేను సీనియర్‌ను. ఏమైనా సమస్యలుంటే పరిష్కారం చూపి స్తారని.. కనీసం ఓదారుస్తారనే విశ్వాసంతో చాలామంది మంత్రులు నా దగ్గరి వస్తారు. అయితే ఎవరొచ్చారు.. ఏం చెప్పారనేది మీకెలా చెప్తా? నేనొక సీనియర్‌ డాక్టర్‌ లేదా సైకియాట్రిస్ట్‌ వంటివాణ్ణి. చాలా మంది సమస్యలతో వస్తారు.

సమస్యతో వచ్చిన వారి గురించి బయ టకు చెప్పడం.. సమస్యలతో వచ్చిన వారితో అసభ్యంగా, చిన్నచూపు చూడటం డాక్టర్‌కు తగదు. నేను కూడా మీతో అలాంటివేమీ చెప్పను. నాకు కొంత సైకాలజీ కూడా తెలుసు. నా దగ్గరకు ఎవరు, ఎందుకొ స్తున్నారో అంచనా వేయగలను. మీరడిగే ప్రశ్నలు ఏ ఉద్దేశంతో అడు గుతున్నారో కూడా అంచనా వేయగలను’’ అని విలేకరులను ఉద్దేశించి జానా అన్నారు. ఇప్పుడున్న రాజకీయాల్లో తానొక విత్తనంలాంటి వాడినని, ఇలా మిగిలితే భావితరాలు వాడుకుంటాయని వ్యాఖ్యానిం చారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీది ఐరన్‌ లెగ్గా, గోల్డెన్‌ లెగ్గా అనేది భవిష్యత్‌ నిర్ణయిస్తుందన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement