జానారెడ్డి కారెక్కుతారు: రసమయి
ఎన్నికలకు ఆరు నెలల ముదు కాంగ్రెస్‌లో నేతలెవరు మిగలరన్న టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రసమయి
హైదరాబాద్: సాధారణ ఎన్నికలకు ఆరు నెలల ముదు కాంగ్రెస్‌లో నేతలెవరు మిగలరని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ జోస్యం చెప్పారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ముఖ్యనేతలంతా త్వరలో కారుక్కుతారని తెలిపారు. కాంగ్రెస్ నేత జానరెడ్డి కూడా వలసలకు మినహాయింపు కాదని.. ఎన్నికలకు ముందే ఆయన కూడా కారెక్కుతారని అభిప్రాయపడ్డారు.
మంత్రి హరీష్ రావుకు నేను జీరాక్స్‌నని, ఆయన ఏం చేస్తే అది నేను ఫాలో అవుతానన్నారు. కానీ ఆయనకు ఇచ్చినంత ప్రచారం మీడియా నాకు ఇవ్వడం లేదని వాపోయారు. క్యాష్ లెస్ గ్రామాల్లో ఆయనే నాకు ఆదర్శమని చెప్పారు. రాష్ట్రంలో అధికారులు ఎమ్మెల్యేలకు తగిన గౌరవం ఇవ్వడం లేదని.. కనీస ప్రోటోకాల్ పాటించడం లేదని ఆరోపించారు. ఉద్యమంలో నుంచి వచ్చారు.. వీళ్లకేం తెలుసు అనే ధోరణిలో ప్రవర్తిస్తున్నారన్నారని, రాష్ట్రంలో అడ్మినిస్ర్టేషన్ సరిగ్గా లేదని నా నోటితో చెప్పలేనని వ్యాఖ్యానించారు.