రాహుల్‌గాంధీ బచ్చా కాదా?
నాకు పెళ్లయింది.. పిల్లలున్నారు.. ఆయనకు అదీ లేదు
► తెలంగాణకు ప్రథమ శత్రువు కాంగ్రెస్సే: మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీఎల్పీనేత జానారెడ్డి హుందాగా మాట్లాడటం లేదని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ‘‘పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నన్ను ‘బచ్చా’ అని అంటున్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ బచ్చా కాదా? నేను పెళ్లిచేసు కున్నా.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాహుల్‌కు కనీసం పెళ్లి కూడా కాలేదు. మాట్లాడేముందు ఇజ్జత్ ఉండాలి’’ అని తెలంగాణ భవన్‌లో సోమవారం జరిగిన టీఆర్‌ఎస్‌ఎస్‌వీ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ కాంగ్రెస్ నేత లపై మండిపడ్డారు.
కాంగ్రెస్ నేతలు అపరిచి తుడు, గజినీ సినిమాలో హీరోల్లాగా మాట్లా డుతున్నారని, పంచభూతాలను సైతం పర మాన్నంగా కాంగ్రెస్ దోచుకుతిన్నదన్నారు.తెలంగాణకు ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని విమర్శించారు. ఆనాడు తెలం గాణను బలవంతంగా ఆంధ్రాలో కలిపింది కాంగ్రెసేనని గుర్తు చేశారు. ఉద్యమ సమ యంలో తెలంగాణ నినాదాన్ని అణచివేయా లని ప్రయత్నించిందన్నారు. ఇప్పుడేమో తెలంగాణ అభివృద్ధిని కాంగ్రెస్ అడుగడుగు నా అడ్డుకుంటున్నదన్నారు.
ఇంటింటికీ మంచి నీళ్లు ఇవ్వాలనే ఆలోచన గతంలో ఏ సీఎంకు గుర్తు రాలేదని, సీఎం కేసీఆర్ మాత్రం మిషన్ భగీరథ చేపట్టారని తెలిపారు. ఆనాడు ఒక్క చిత్తూరు జిల్లాలో మంచినీటి పథకానికి రూ.9 వేల కోట్లు ఖర్చుయితే తెలంగాణలో 31 జిల్లాల తాగునీటికి రూ.43వేల కోట్లు ఖర్చు కావా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు కాంట్రా క్టర్లు, సబ్ కాంట్రాక్టర్లు, బిల్లులు తప్ప మరేం కనిపించవని ఆయన ధ్వజమెత్తారు.
టీఆర్‌ఎస్‌ఎస్‌వీ... తెలంగాణ ప్రగతి సైన్యం
టీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం (టీఆర్‌ఎస్‌ఎస్‌వీ) తెలంగాణ ప్రగతి సైన్య మని కేటీఆర్ అన్నారు. విద్యార్థి విభాగం అన్ని కాలేజీలు, యూనివర్సిటీలు తిరగాల ని సూచించారు. కాలేజీల్లో, నియో జకవర్గ స్థాయిలో కమిటీలు వేయాలని, 31 జిల్లాల్లో సదస్సులు జరిపాక రాజధానిలో రాష్ట్ర సదస్సు నిర్వహిద్దామన్నారు.
సమావేశం అనంతరం ఆయన టీఆర్‌ఎస్‌ఎస్‌వీ ర్యాలీని జెండాఊపి ప్రారంభించారు. ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్‌ఎస్‌వీ సైన్యంగా పనిచేసిందని, ఇప్పుడుకూడా బంగారు తెలంగాణ కోసం పనిచేయాలని పిలుపుని చ్చారు. జ్ఞానంకోసం చదువు.. జనంకోసం నడువు అన్నది సీఎం కేసీఆర్ ఆలోచనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాసన మండలిలో ప్రభుత్వవిప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మేయర్ బొంతురామ్మోహన్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యే గాదరి కిషోర్, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.