జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయిన తర్వాత ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడితే ప్రయోజనం ఏమిటని రాయలసీమకు చెందిన ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి.. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో వ్యాఖ్యానించారు. బుధవారం జేసీ కాసేపు అసెంబ్లీ లాబీల్లో హల్‌చల్ చేశారు. సీఎల్పీ నేత కె.జానారెడ్డి, పీసీసీ చీఫ్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే ఎ.రేవంత్‌రెడ్డి తదితరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘‘కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణతో కలిపి ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఇలా ఉండేది కాదు. విభజన సమయంలో మేం చెప్పిన సూచనలేవీ మీరు వినలేదాయె.. టీఆర్‌ఎస్‌ను సరిగా ఎదుర్కోవడం లేదు. ప్రతిపక్ష పార్టీగా ఫెయిల్ అయ్యారు.