తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ వైఫల్యాలను కప్పిపచ్చుకోవాడినికే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని కాంగ్రెస్ సీనియర్‌నేత కె జానారెడ్డి విమర్శించారు. శుక్రవారం మీడియాతో ఆయన ముందస్తు ఎన్నికలపై స్పందించారు. తెలంగాణలో రాజకీయ అనిశ్చితి ఎక్కడుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో రాజకీయ కలుషితానికి కేసీఆరే కారణమన్నారు. ఆయన ధోరణి ప్రజాస్వామ్యానికి చేటని మండిపడ్డారు.