‘రొయ్యల కోసమే ప్రాజెక్టులు కడుతున్నకేసీఆర్’
‘రొయ్యల కోసమే ప్రాజెక్టులు కడుతున్నకేసీఆర్’
Published Fri, Jan 6 2017 3:29 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
హైదరాబాద్ : ఆ నాడు సభలో మాదిరి కాంగ్రెస్ ధర్మం వైపు ఉందని శాసనాసభా పక్ష నేత జానారెడ్డి తెలిపారు. ఆయన శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో మీడియా తో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కాంగ్రెస్ వల్లే సభ హుందాగా జరుగుతుందన్నారు. పాండవుల మాదిరి తాము ఎవరి పాత్ర వారు నిర్వర్తిస్తున్నామన్నారు. తనది ధర్మరాజు పాత్ర అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏడాది పాటు నిద్రపోయి ఇప్పుడు మేల్కొందని వ్యాఖ్యానించారు. కేంద్ర పథకం ఉదయ్ లో 20 రాష్ట్రాలు చేరితే లోపభూయిష్టం ఎలా అవుతుందని ప్రశ్నించారు.
ప్రాజెక్టులపై కేసీఆర్ మాటలు వింటుంటే ఎర్ర రొయ్యల కోసం ప్రాజెక్టులు నిర్మిస్తున్నట్టు ఉందని ఎద్దేవా చేశారు. కొందరు మంత్రులు సభలో మాట్లాడుతున్న తీరు సరిగాలేదని, మాటికి మాటికి ‘నా బిడ్డలు.. మా కడుపులో పెట్టుకుంటాము’ అంటున్నారన్నారు. భూ సేకరణ చట్టం పై తాను సభలో లేవనేత్తె వరకు ప్రభుత్వం కూడా దాన్ని మన్నించలేదని గుర్తు చేశారు. ప్రభుత్వం తీరు చూస్తుంటే తాను ఎందుకు చెప్పానని అనిపిస్తోందని.. కానీ సభలో ఓ సభ్యుడుగా తన ధర్మాన్ని తాను పాటించానన్నారు. ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని రాష్ట్రపతి ఆమోదం ఇస్తారని అనుకోవడం లేదని, ప్రతి ఒక్కరు సత్యాన్ని, ధర్మాన్ని పాటించాలన్నారు.
గురువారం(నిన్న) సభలో భట్టి విక్రమార్క పై హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు చాలా సిల్లీ అని, భట్టి విక్రమార్క కాంగ్రెస్ సభ్యుడన్న సంగతి హరీష్ గుర్తించక పోతే ఎలా..? అని ప్రశ్నించారు. సభలో హరీష్ రావు హుందాగా మాట్లాడాల్సిందన్నారు. విద్యుత్ రంగంలో గత పాలకుల లోపాలున్నాయని అని కేసీఆర్ అనడం హాస్యాస్పదమని, దేశంలోనే ఏ రాష్ట్రానికి దక్కనన్ని అవార్డ్ లు ఉమ్మడి ఏపీ కి వచ్చాయని గుర్తు చేశారు. ఇప్పటి వరకు ఉన్న ప్రాజెక్టు లు అన్ని కాంగ్రెస్ హయాంలో తెచ్చినవని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం కొత్తగా తెచ్చింది ఏమి లేవని విమర్శించారు. కేసీఆర్ పూర్తి చేస్తామన్న భద్రాద్రి, యాదాద్రి ప్రాజెక్టు లు 2022 కి కూడా పూర్తికావని జానారెడ్డి వ్యాఖ్యానించారు.
Advertisement
Advertisement