సాక్షి, నల్లగొండ: ‘ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి జ్వరమొచ్చిందో.. నొప్పొచ్చిందో నాకేం తెలుసు? భట్టి విక్రమార్క పాదయాత్రకు ఎందుకు పోలేదో ఆయన్నే అడగాలి.. నన్నుకాదు’ అని కుందూరు జానారెడ్డి అన్నారు. గురువారం నల్లగొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జానారెడ్డి మాట్లాడారు. భువనగిరి జిల్లాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రలో ఎంపీ కోమటిరెడ్డి ఎందుకు పాల్గొనడం లేదని విలేకరులు అడగ్గా జానారెడ్డి పైవిధంగా స్పందించారు.
నల్లగొండ జిల్లాలో ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ హయాంలో చేపట్టినవేనని, ఇప్పటికే 14 లక్షల ఎకరాలకు నీరందిస్తున్నాయని, 7 లక్షల ఎకరాలకు నీరందించే ప్రాజెక్టులు బీఆర్‌ఎస్ పాలనలో నత్తనడకన సాగుతున్నాయని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం కేసీఆర్ తరమే కాదన్నారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ మాట్లాడుతూ నిరుద్యోగుల విషయంలో ప్రభు త్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే టీఎస్‌పీఎస్సీ పేపర్లు లీకయ్యాయన్నారు. విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్ పాల్గొన్నారు.
చదవండి: ముహూర్తం ఫిక్స్!.. పొంగులేటి, జూపల్లి ఏ పార్టీలో చేరుతారో?
Comments
Please login to add a commentAdd a comment