హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, సీఎల్పీ ఉపనేత భట్టి విక్రమార్క పరస్పరం మాటలు తూటాలు పేల్చుకోవడంతోlసభ కాస్తంత వేడెక్కింది.
సాక్షి, హైదరాబాద్: హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, సీఎల్పీ ఉపనేత భట్టి విక్రమార్క పరస్పరం మాటలు తూటాలు పేల్చుకోవడంతో సభ కాస్తంత వేడెక్కింది. చర్చ సందర్భంగా ప్రభుత్వ జవాబుకు నిరసన తెలిపే అవకాశం ఇవ్వాలని విపక్ష నేత జానారెడ్డి స్పీకర్‌ను కోరగా ఆయన అనుమతించారు. నిరసనను తెలిపేందుకు జానారెడ్డి అనుమతితో భట్టి మాట్లాడుతుండగా, నిరసన తెలిపే హక్కు విపక్ష నేతకే ఉందని నాయిని అభ్యంతరం వ్యక్తం చేశారు. మీరు మండలి సభ్యులు కనుక అసెంబ్లీ నియమాలు తెలిసి ఉండకపోవచ్చని భట్టి అనడంతో.. నాయిని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ జోక్యంతో ఇద్దరి మధ్య ఆవేశం కొద్ది సేపటికి చల్లారింది.