
ఆ ఒక్కటీ నెరవేరాలంటే..రాష్ట్రమంతా తిరగాలి
భవిష్యత్‌లో ముఖ్యమంత్రి అంటూ చెప్పకుండానే.. చెప్పిన జానారెడ్డి
గుర్రంపోడు: సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు అనుభవించా.. ఇప్పుడున్న బాధ్యతలతోపాటు మీరు కోరుకున్న ఆ ఒక్కటీ నెరవేరాలంటే రాష్ట్రమంతా తిరగాల్సి ఉంది. మీకు ఎప్పుడూ అందుబాటులో లేకున్నా అద్దంలో చూసుకుంటే కనిపించే ముఖంలాగా మీరు, మీ సమస్యలు కనిపిస్తుంటూనే ఉంటాయి.
ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలు అంటూ సీఎల్పీ నేత జానారెడ్డి ముఖ్యమంత్రి పదవి గురించి నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. నల్లగొండ జిల్లా గుర్రంపోడులో శుక్రవారం జన ఆవేదన సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. జానారెడ్డికి దశాబ్దాలుగా మీరిచ్చిన ప్రజాశక్తి ఇదని.. ఈ శక్తి తగ్గకుండా చూసుకుని ముందుకు నడిపిస్తే ఏదైనా సాధ్యమేనన్నా రు. మీరు కోరుకున్న ఆ పదవి అంటూ ఒకటికి, రెండుసార్లు చెప్పిన జానారెడ్డి.. కార్యకర్తలకు తాను భవిష్యత్‌లో ముఖ్యమంత్రి అంటూ చెప్పకుండానే ఆశలు కల్గించారు.