సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్‌పై జానారెడ్డి వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాడ్లాడుతూ కేటీఆర్ పార్లమెంటరీ పద్ధతిలోనే మాట్లాడారని స్పష్టం చేశారు. సంస్కారం గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడటం విడ్డూరమని ఉందని ఆయన ఏద్దేవా చేశారు.
జానారెడ్డికి కాంగ్రెస్ నేతలు ఇవ్వని గౌరవాన్ని కేసీఆర్ ఇచ్చారన్నారు. మరో వైపు ప్రధాని మోదీపై కేసీఆర్ ఎలాంటి పరుష వ్యాఖ్యలు చేయలేదని.. బీజేపీ నేతలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని జగదీశ్ రెడ్డి మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment