తమ్మినేని వీరభద్రంకు కాంగ్రెస్‌ నేత జానారెడ్డి ఫోన్‌ | Jana Reddy Phone Call To Tammineni Veerabhadram | Sakshi
Sakshi News home page

తమ్మినేని వీరభద్రంకు కాంగ్రెస్‌ నేత జానారెడ్డి ఫోన్‌

Published Sun, Nov 5 2023 10:16 AM | Last Updated on Sun, Nov 5 2023 10:49 AM

Jana Reddy Phone Call To Tammineni Veerabhadram - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అభ్యర్థుల ప్రకటన వాయిదా వేసుకోవాలంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి కాంగ్రెస్‌ నేత జానారెడ్డి ఫోన్‌ చేశారు. ఇప్పటికే 14 స్థానాల్లో పేర్లు ప్రకటించామని, మరో మూడు స్థానాలు చర్చల్లో ఉన్నాయన్న తమ్మినేని.. కుదరదని తేల్చి చెప్పారు. మిగతా స్థానాలను రెండురోజుల్లో ప్రకటిస్తామని చెప్పిన తమ్మినేని.. కాంగ్రెస్‌తో మాట్లాడటం తప్ప ఎలాంటి నిర్ణయం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

​కాగా, కాంగ్రెస్‌ పార్టీతో వామపక్ష పార్టీల పొత్తుల వ్యవహారం ఇప్పటికీ గందరగోళంగానే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఐక్యంగా పోటీ చేయాలనే ఆలోచనతో కమ్యూనిస్టులు కొంత కాలంగా కాంగ్రెస్‌ పార్టీతో మంతనాలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ పార్టీ స్పష్టత ఇవ్వనికారణంగా ఒంటరి పోరుకు సీపీఎం సిద్ధం కాగా, పొత్తు పెట్టుకుని పోరులో నిలవాలని సీపీఐ సంప్రదింపుల ప్రక్రియను కొనసాగిస్తూనే ఉంది. ఈ క్రమంలో సీపీఐకి ఒక చోట పోటీతో పాటు ఒక ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్‌ పార్టీ తాజాగా అంగీకరించినట్లు తెలిసింది.

ఈ అంశంపై సీపీఐ సైతం సుముఖత వ్యక్తం చేసి పొత్తుతో ముందుకు సాగనున్నట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సీపీఐ అభ్యర్థిని బరిలోకి దింపేందుకు దాదాపు నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్‌ పార్టీ మాత్రం పొత్తు అంశం, సీటు కేటాయింపు పట్ల ఇప్పటికీ అధికారికంగా ప్రకటన చేయలేదు.
చదవండి: ఎన్నికల పోరుకు రెడీ.. అభ్యర్థులను ప్రకటించిన సీపీఎం 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement