ట్రంప్‌లాగే అధికారంలోకి వస్తాం
► అమెరికా ఎన్నికల్లో హిల్లరీనే గెలుస్తుందని సర్వేలన్నీ చెప్పాయి: జానారెడ్డి
► కేసీఆర్ సర్వే హాస్యాస్పదం
► ప్రజా సమస్యలను పక్కనబెట్టి సర్వేలు, ఎన్నికలేంటి?
► ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజలే కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తారని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: ప్రజా సమస్యలను గాలికొదిలేసి ఎన్నికలు, సర్వేలే ముఖ్యమన్న ట్టుగా సీఎం కేసీఆర్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష నాయకుడు కె.జానారెడ్డి విమర్శించారు. అమెరికాలో హిల్లరీ క్లింటన్ గెలుస్తారని సర్వేలన్నీ వెల్లడిస్తే అనూహ్యంగా ట్రంప్ అధ్యక్షుడిగా గెలిచారని గుర్తుచేశారు. ‘అమెరికాలో ట్రంప్‌లాగానే 2019లో కాంగ్రెస్ విజయం సాధిస్తుంది. ఇక్క డ కాంగ్రెస్ పార్టీయే ట్రంప్.. వ్యక్తులు కాదు’ అని వ్యాఖ్యానించారు.
శాసన మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డితో కలసి అసెంబ్లీ ఆవరణలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లా డారు. ప్రజా సమస్యలు, రైతుల ఆత్మహత్య లు, ఆందోళనలను పక్కన బెట్టిన ప్రభుత్వం సర్వేలతో ప్రజలను పక్కదారి పట్టించే ప్రయ త్నం చేస్తున్నదని దుయ్యబట్టారు. ఇలాంటి సర్వేలను తాను విశ్వసించనన్నారు. ప్రజా స్వామ్య పరిరక్షణ కోసం 2019లో కాంగ్రెస్‌కు ప్రజలే పట్టం కడతారన్నారు. ‘ప్రజల ఆకాంక్ష లను తీర్చి, వారి మన్ననలు పొందడంలో తప్పులేదన్నారు.
దేశానికి స్వాతంత్య్రం లేన ప్పుడు ప్రజల కోసం నిలబడి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా ప్రజా సమస్యలపై పోరాటం చేయడమే కాంగ్రెస్ ధ్యేయం. 2019 ఎన్నికల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్‌ను ప్రజలే అధికారం లోకి తెస్తారన్న విశ్వాసముంది. మాకు సర్వే లపై కన్నా ప్రజలపై విశ్వాసం ఉంది. సీఎం చేయించుకున్న సర్వే ఫలితాలు హాస్యాస్ప దంగా ఉన్నాయి. అందులో వాస్తవాలేమిటో, ఎలాంటి సర్వేనో ప్రజలే తేలుస్తారు’ అని ఆయన పేర్కొన్నారు.
అందరితో చర్చించాకే పొత్తులపై నిర్ణయం
టీడీపీతో పొత్తు అంశం ఇప్పుడు అసందర్భ మని, పొత్తులపై చర్చించాల్సిన అవసరమే లేదని జానా పేర్కొన్నారు. పొత్తులపై కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి వ్యాఖ్యలను వక్రీక రించినట్టుగా ఉందన్నారు. పొత్తుల అంశంపై మాట్లాడాల్సి వస్తే ముందుగా పార్టీలో అన్ని స్థాయిల్లోని నాయకులంతా చర్చించుకున్న తర్వాత నిర్ణయాలుంటాయన్నారు.
‘రాష్ట్రం ఏర్పాటై మూడేళ్లవుతున్న సందర్భంగా జూన్ 1న సంగారెడ్డిలో తెలంగాణ ప్రజాగర్జన పేరు తో బహిరంగ సభను నిర్వహిస్తున్నాం. ఇందు లో ఈ మూడేళ్లలో రైతులు, ప్రజా సమ స్యలను ప్రజలకు వివరిస్తాం’ అని చెప్పారు. ప్రాజెక్టులు పూర్తి కాకుండా కాల్వలు తవ్వొద్దన్న సీఎం ఇప్పుడు కాల్వలే ముందు తవ్వాలని ఎందుకు అంటున్నారని షబ్బీర్ అలీ ప్రశ్నించారు. ప్రజాగర్జన సభలో కేంద్రం, రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలపై రాహుల్ గాంధీ చార్జిషీట్ పెడతారని పొంగులేటి సుధాకర్‌రెడ్డి చెప్పారు.