కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జానా సీఎం
మా మద్దతు సీఎల్పీ నేతకే: ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి
త్రిపురారం: సీఎల్పీ నేత జానారెడ్డి నాయకత్వం వహించి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తే ఆయనే సీఎం అవుతారని, ఆయనకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుం దని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడారు. కాంగ్రెస్‌లో గ్రూపు తగాదాలు లేకుండా చూసే బాధ్యత సీఎల్పీ నేతపైనే ఉందన్నారు. టీఆర్‌ఎస్ లో ఏ ఒక్కనేత కూడా ఆత్మగౌరవంతో ఉండలేకపోతు న్నారన్నారు. టీఆర్ ఎస్‌లోకి వెళ్లిన ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్‌రావులకు సీఎం కేసీఆర్ అపా యింట్ మెంట్ కూడా లభించడం లేదని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్‌ను మచ్చిక చేసుకుని జగదీశ్‌రెడ్డి మంత్రి అయ్యాడే తప్ప ఆయన ప్రజలకు చేసిందేమీ లేదన్నారు.
ఉత్తమ్ సర్వే ఉత్తుత్తిదే: రాజగోపాల్‌రెడ్డి
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇటీవల చేయించిన సర్వే ఉత్తుత్తిదేనని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 50 సీట్లల్లో గెలుస్తాం, మరో 20 సీట్లలో కష్టపడితే విజయం సాధిస్తామంటూ వచ్చిన రిపోర్ట్ ఎలా రూపొందించారన్నారు.