MLC Rajagopal Reddy
-
రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన
అక్రమ అరెస్టులు, నిర్బంధాలు సరికాదు: జానారెడ్డి చౌటుప్పల్: రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన సాగుతోందని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కుందూరు జానారెడ్డి ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డితో కలిసి బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజల ఆకాంక్ష మేరకు పరిపాలన సాగడంలేదన్నారు. తెలంగాణ సాధనకోసం ముందుండి పోరాటాలు చేసిన కోదండరాం వంటి నాయకుడిని అరెస్ట్ చేయడం సరైనది కాదన్నారు. నిరుద్యోగ ర్యాలీకి వెళ్లకుండా గ్రామస్థాయి నుంచి ఎక్కడికక్కడ అరెస్టులు చేయించి నిర్బంధించడం శోచనీయం అన్నారు. అక్రమ అరెస్ట్‌లను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందనీ, ప్రజాస్వామికవాదులు ప్రభుత్వ తీరును ఖండించాలని కోరారు. ప్రభుత్వ పాలనా తీరు ప్రజలకు త్వరలోనే అర్థమవుతుందన్నారు. -
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జానా సీఎం
మా మద్దతు సీఎల్పీ నేతకే: ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి త్రిపురారం: సీఎల్పీ నేత జానారెడ్డి నాయకత్వం వహించి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తే ఆయనే సీఎం అవుతారని, ఆయనకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుం దని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడారు. కాంగ్రెస్‌లో గ్రూపు తగాదాలు లేకుండా చూసే బాధ్యత సీఎల్పీ నేతపైనే ఉందన్నారు. టీఆర్ఎస్ లో ఏ ఒక్కనేత కూడా ఆత్మగౌరవంతో ఉండలేకపోతు న్నారన్నారు. టీఆర్ ఎస్‌లోకి వెళ్లిన ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్రావులకు సీఎం కేసీఆర్ అపా యింట్ మెంట్ కూడా లభించడం లేదని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్‌ను మచ్చిక చేసుకుని జగదీశ్‌రెడ్డి మంత్రి అయ్యాడే తప్ప ఆయన ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఉత్తమ్ సర్వే ఉత్తుత్తిదే: రాజగోపాల్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇటీవల చేయించిన సర్వే ఉత్తుత్తిదేనని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 50 సీట్లల్లో గెలుస్తాం, మరో 20 సీట్లలో కష్టపడితే విజయం సాధిస్తామంటూ వచ్చిన రిపోర్ట్ ఎలా రూపొందించారన్నారు. -
‘ఒక్క ఎన్‌కౌంటర్‌తో 100 మంది నయీంలు’
యాదాద్రి భువనగిరి: గ్యాంగ్‌స్టర్ నయీంను ఎన్కౌంటర్ చేయించిన కేసీఆర్ ప్రభుత్వం వంద మంది నయీంలను తయారు చేసిందని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విమర్శించారు. నయీంతో సంబంధాలు నెరిపిన ముఖ్య నాయకులను అరెస్టు చేయకపోవటం సిగ్గుచేటన్నారు. భువనగిరిలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నయీం కేసును సీబీఐకి అప్పగించి, నిష్పక్షపాతంగా విచారించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హోం మంత్రి నాయిని కేవలం ప్రారంభోత్సవాలు చేయటం వరకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. నయీం కేసును నీరుగారిస్తే ఊరుకోబోమని, త్వరలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. -
నయూమ్ కేసు సీబీఐకి అప్పగించాలి
ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి యాదగిరిగుట్ట/వలిగొండ: గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత రాజకీయ పార్టీల నాయకులు, పలు శాఖల అధికారుల చరిత్రలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న క్రమంలో కేసును సీబీఐకి అప్పగించాలని ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట, వలిగొండ మండలం నాతాళ్లగూడెంలో వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. 20 ఏళ్లలో గ్యాంగ్‌స్టర్ సంపాదించిన అక్రమ ఆస్తులను బయటపెట్టాలని, ఆయనకు సహకరించిన ప్రజాప్రతినిధులను, అధికారులను కఠినంగా శిక్షించాలన్నారు. తెలంగాణ, ఏపీలోనే కాక మరో ఐదు రాష్ట్రాల్లో ఆయన కార్యకలాపాలు విస్తరించాయని, ఎంతోమంది అమాయక ప్రజల ఆస్తులను లాగేసుకొని రోడ్డుపాలు చేశారన్నారు. జిల్లాలో 99 శాతం మంది అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు నయీమ్‌తో సంబంధాలు కలిగి ఉన్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా భువనగిరికి చెందిన కౌన్సిలర్లను నయీమ్‌తో బెదిరింపజేసి అధికారపార్టీలో చేర్పించుకున్నారన్నారు. నయీమ్ చనిపోయిన తర్వాత ఆయన ఇంట్లో లభించిన డైరీలో ఎంతోమంది రాజకీయ నాయకుల చరిత్రలు ఉన్నాయని, వాటిని సీఎం కేసీఆర్ బయట పెట్టాలన్నారు. సిట్ విచారణ లో వెల్లడైన విషయాలను గోప్యంగా ఉంచి అధికార పార్టీకి చెందిన నాయకులను కేసు నుంచి తప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నయూమ్ మొత్తం ఆస్తులను చూపెట్టకుండా రూ. 2.80 కోట్లు మాత్రమే చూపెట్టడం విడ్డూరమన్నారు. ఆ ఆస్తులను పేదలకు పంచాలని, కేసును నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.