‘ఒక్క ఎన్‌కౌంటర్‌తో 100 మంది నయీంలు’
యాదాద్రి భువనగిరి: గ్యాంగ్‌స్టర్ నయీంను ఎన్‌కౌంటర్ చేయించిన కేసీఆర్ ప్రభుత్వం వంద మంది నయీంలను తయారు చేసిందని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విమర్శించారు. నయీంతో సంబంధాలు నెరిపిన ముఖ్య నాయకులను అరెస్టు చేయకపోవటం సిగ్గుచేటన్నారు.
భువనగిరిలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నయీం కేసును సీబీఐకి అప్పగించి, నిష్పక్షపాతంగా విచారించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హోం మంత్రి నాయిని కేవలం ప్రారంభోత్సవాలు చేయటం వరకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. నయీం కేసును నీరుగారిస్తే ఊరుకోబోమని, త్వరలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని రాజగోపాల్ రెడ్డి తెలిపారు.