ఇలాగే అప్పులైతే.. రాష్ట్రానికి మాల్యా పరిస్థితే
ఇలాగే అప్పులైతే.. రాష్ట్రానికి మాల్యా పరిస్థితే
Published Tue, Mar 28 2017 4:29 PM | Last Updated on Sat, Aug 11 2018 6:42 PM
హైదరాబాద్: బడ్జెట్ వాస్తవ విరుద్ధంగా వుందని అసెంబ్లీలో తాను చెప్పిన విషయాలు కాగ్ నివేధికాలోను వెల్లడయ్యాయని కాంగ్రెస్ నేత జానారెడ్డి తెలిపారు. ఆయనిక్కడ మంగళవారం మాట్లాడుతూ 'బడ్జెట్ గణాంకాలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని కాగ్ కూడా తేల్చింది. పద్దులు నిర్వహణ నిబంధనలను ప్రభుత్వం అతిక్రమించింది అని కాగ్ ఆక్షేపించింది. Sc,st సబ్ ప్లాన్ నిధుల్లో సగం కూడా ఖర్చుచేయలేదని కాగ్ తేల్చింది. టీఆర్‌ఎస్ హామీలకు తగిన విధంగా ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదు. కేటాయించిన నిధులను కూడా పూర్తిగా ఖర్చు చేయడంలేదు. కొత్త రాష్ట్రం అనే సంయమనం పాటిస్తూ ప్రభుత్వానికి సహకరిస్తున్నాం.
మా సహకారాన్ని ప్రభుత్వం సరిగా అర్ధం చేసుకోలేకపోతే ప్రజా ఆందోళనలు వస్తాయి. ఆస్తులు.. ఆదాయాల కంటే.. అప్పులు ఎక్కువయితే ప్రమాదం. ప్రభుత్వం ఇష్టానుసారంగా చేస్తున్న అప్పులు ఆందోళన కరంగా ఉన్నాయి. ప్రభుత్వ ఆర్ధిక విధానాలు రాష్ట్రంలో నెలకొన్న వాస్తవ పరిస్థితిలను ఆర్ధిక వేత్తలు ప్రజలకు తెలియజేయాలి. ప్రభుత్వం ఇలాగే అప్పులు చేసుకుంటూ పోతే విజయ్ మాల్యాకి పట్టిన పరిస్థితే రాష్ట్రానికి పడుతుంది. అసెంబ్లీలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకే ప్రభుత్వానికే కాదు.. ఇతరపార్టీలకు కూడా కాంగ్రెస్ సహకరించింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పై చేసిన వాఖ్యలు పసలేనివి.. ఉద్వేగం, ఉద్రేకం తో మాట్లాడినవి. రేవంత్ కాదు చంద్రబాబు మాట్లాడితే స్పందిస్తా' నని ఆయన తెలిపారు.
కాగా మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ బడ్జెట్ పై మేము విమర్శలు చేస్తే రాజకీయం అన్నారు. ఇపుడు కాగ్ కూడా మేము చేసిన ఆరోపణలే తన నివేదికలో పేర్కొంది. కాగ్ నివేదికను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని తప్పుని సరిదిద్దుకోవాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.
Advertisement
Advertisement