
త్రిపురారం (నాగార్జునసాగర్): ‘కేసీఆర్ వివిధ సభల్లో కాంగ్రెస్ నేతల గోచీలు ఊడగొడతామని అం టున్నాడు. మిస్టర్ కేసీఆర్.. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నేతల లాగులు ఊడగొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నువ్వు.. విపక్ష పార్టీల నాయకులను ఎగ తాళి చేస్తూ గౌరవం లేకుండా నోటికి వచ్చినట్లు తిడు తున్నావు. నువ్వో సంస్కార హీనుడివి’ అని సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి ఘాటుగా విమర్శలు చేశారు. నల్లగొండ జిల్లా త్రిపురారం మండలకేంద్రం లో గురువారం జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ నిత్యం మాయమాటలు చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు.
సచివాలయానికి రాకుండా ఉన్న సీఎం దేశంలో మరెవరూ లేరని ఎద్దేవా చేశారు. అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్ దిట్ట అని, ఆత్మగౌరవం లేని వ్యక్తి అని జానారెడ్డి ధ్వజమెత్తారు. సాగితే సాగు మల్లయ్య.. లేకపోతే బోడ మల్లయ్యలాగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారన్నా రు. తెలంగాణ ఇస్తే మీ వెంటే ఉంటానని ప్రమాణం చేశారన్నారు. అనేక రకాల అవసరాలను ఆసరా చేసుకొని కాంగ్రెస్‌ను మోసం చేసిన ఘనుడు కేసీఆర్ అని ధ్వజమెత్తారు. మరోసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తున్నారన్నారు. జనా లకు డబ్బిచ్చి కొని సభలకు తరలిస్తున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment