మంత్రి జగదీష్ రెడ్డి వ్యంగ్యంగా మట్లాడి తనను అవమానపరిచారని కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి అన్నారు.
మంత్రి జగదీష్ రెడ్డి వ్యంగ్యంగా మట్లాడి తనను అవమానపరిచారని కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి అన్నారు. ఆయన ఇంతకుముందు కూడా నోరు పారేసుకుని, ఆ తర్వాత క్షమాపణ చెప్పారని గుర్తుచేశారు. తెలంగాణ సాధన కోసం తాను చేసిన కృషి ఏంటో ముఖ్యమంత్రి కేసీఆర్ను అడిగితే చెబుతారని.. ఇప్పటికైనా జగదీష్ రెడ్డి తన తప్పేంటో తాను తెలుసుకుని.. హుందాగా మాట్లాడాలని అన్నారు.
రేవంత్ రెడ్డిని సభలో మాట్లాడనీయమన్న టీఆర్ఎస్ మంత్రులు.. అదే పార్టీ సభ్యులు అలా చేస్తే ఎలా సమర్థిస్తారని చిన్నారెడ్డి ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికో న్యాయం.. వారికో న్యాయం అమలుచేస్తారా అంటూ నిలదీశారు.