chinnareddy
-
కేసీఆర్, కేటీఆర్‌వి పచ్చి అబద్ధాలు
సుందరయ్య విజ్ఞాన కేంద్రం (హైదరాబా ద్): రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలు ఎండిపోయాయంటూ బీఆర్ఎస్ పార్టీ అధి నేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్య క్షు డు డాక్టర్ జి.చిన్నారెడ్డి ఆరోపించారు. గత వర్షాకా లంలో తక్కువ వర్షపాతం ఉండటం వల్ల సుమారు రెండు లక్షల ఎకరాల వరకు ఎండిపోయి ఉంటా యని, కానీ వాటిని ఎక్కువగా చూపుతూ రైతులను తప్పు దోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఆదివా రం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ వ్యవసాయ శాఖ విశ్రాంత అధికారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ అధికారుల సంక్షేమ సంఘం చైర్మన్, రిటైర్డ్ సంయుక్త వ్యవసాయ సంచాలకులు భోమిరెడ్డి కృపాకర్‌రెడ్డి జన్మది నాన్ని పురస్కరించుకుని ఆత్మీయ సత్కారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిన్నారెడ్డి మాట్లాడుతూ, రానున్న పార్ల మెంటు ఎన్నికలలో లబ్ధిపొందేందుకు రైతులను, ప్రజలను ప్రతిపక్షాలు తప్పు దారి పట్టిస్తున్నాయని విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని, వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ సంస్థల అభివృద్ధికి తమవంతుగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ విశ్రాంత వ్యవసాయ శాఖ అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు డాక్టర్ రంగారెడ్డి అధ్యక్షతన జరిగి న ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి చంద్రశేఖ ర్, తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం అధ్యక్షులు డాక్టర్ వైద్యనాథ్, ప్రధాన కార్యదర్శి జి. కృపాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కు మార్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సి.ఆర్.బిస్వాల్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కృపాకర్‌రెడ్డి దంపతులను ఘనంగా సత్కరించారు. -
వనపర్తి కాంగ్రెస్ అభ్యర్థిని మార్చే యోచనలో అధిష్టానం
వనపర్తి: నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిత్వంపై మరోమారు సందిగ్ధం నెలకొంది. ఢిల్లీ పెద్దలు 20 రోజుల పాటు చర్చలు జరిపి చివరకు టికెట్‌ను మాజీ మంత్రి డా.జి.చిన్నారెడ్డికి ఖరారు చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఆదివారం గాంఽధీభవన్‌లో టికెట్లు ఖరారైన వారిలో సుమారు 70 మంది అభ్యర్థులను పిలిపించి బీ–ఫారాలు కూడా అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రకటించిన పేర్లలో మూడు నియోజకవర్గాల్లోని అభ్యర్థులను మార్చాలని అధిష్టానం నిర్ణయించగా.. అందులో వనపర్తి కూడా ఉంది. తన పేరును స్వయంగా సోనియాగాంధీ సూచించి అభ్యర్థుల జాబితాలో రాయించిందంటూ మాజీ మంత్రి జి.చిన్నారెడ్డి తన కుమారుడితో కలిసి ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఈ నెల 7న నామినేషన్ దాఖలు చేసేందుకు కార్యకర్తలు, నాయకులతో చర్చలు జరిపి జన సమీకరణకు కార్యాచరణ రూపొందించుకున్నారు. ఆదివారం శ్రీరంగాపురం మండలంలో ప్రచారం కూడా చేశారు. అధిష్టానం ఇచ్చిన షాక్‌తో సాయంత్రం హుటాహుటిన హైదరాబాద్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. విషయం తెలిసి ఫోన్లో సంప్రదించేందుకు యత్నించగా అందుబాటులోకి రాలేదు. మేఘారెడ్డికి అవకాశం.. ఇటీవల అధికార పార్టీ నుంచి బయటకు వచ్చి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరిన పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డికి కాంగ్రెస్‌పార్టీ బీ–ఫారం ఇచ్చే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. నియోజకవర్గంలో కొన్ని నెలలుగా తిరుగుతూ కాంగ్రెస్ పార్టీని గ్రౌండ్ లేవల్ నుంచి పైకి తీసుకొచ్చి జనంలో పేరు తెచ్చుకున్నారని, అభ్యర్థిగా మేఘారెడ్డి ఉండాలని సర్వేల్లో వెల్లడైనందుకు అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కష్టకాలంలో గెలుపు గుర్రాలకు టికెట్లు ఇచ్చి పదేళ్ల తర్వాత అధికారం చేజిక్కించుకునే ప్రయత్నాల్లో వనపర్తి అభ్యర్థి మార్పు చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. రాహుల్‌గాంధీ ప్రకటించినా.. ఇటీవల కొల్లాపూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారసభలో వనపర్తి కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి డా. జి.చిన్నారెడ్డి అంటూ స్వయంగా రాహుల్‌గాంధీ సభకు పరిచయం చేసినా.. అభ్యర్థిత్వాన్ని మార్చడంతో కాంగ్రెస్ పార్టీలో ఇవేం నిర్ణయాలనే గుసగుసలు వినిపిస్తున్నాయి. -
ఓటర్లకు గాలం.. లాబీయింగ్ షురూ..
సాక్షి వనపర్తి: ముందస్తు ఎన్నికల ప్రచారానికి ఈనెల 5వ తేదీతో గడువు ముగిస్తుండటం, 7న పోలింగ్ జరగనుండడంతో అన్ని పార్టీల అభ్యర్థులు పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారించారు. గడిచిన కొన్ని రోజులుగా గ్రామాలు, పట్టణాల్లో కార్యకర్తలు, కులసంఘాలు, యువజన సంఘాలను కలిసి ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో ఎంత గొప్పగా ప్రచారం చేసినప్పటికీ పోలింగ్ సమయంలో మేనేజ్మెంట్ చేయకపోతే దాన్ని ఓట్లుగా మార్చడంలో విఫలమయ్యే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే ఓటింగ్‌కు రెండు రోజుల ముందు నుంచే అసలు కథ ప్రారంభం అవుతుంది. కాబట్టి ఓటర్ను పోలింగ్ కేంద్రం వరకు రప్పించి, ఓటు వేయించడంతో పోల్ మేనేజ్మెంట్ ముగుస్తుంది. బూత్‌స్థాయిలో బలమైన క్యాడర్ పోల్ మేనేజ్మెంట్ చేయడంలో టీఆర్ఎస్ పార్టీ కి గట్టి పట్టుంది. ఎందుకంటే 2014 ఎన్నికల సమయంలో ఎక్కువగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపైనే దృష్టి సారించిన నాయకులు అధికారంలోకి వచ్చాక జరిగిన రాజకీయ పునరేకీకరణలో భాగంగా టీడీపీ, కాంగ్రెస్ ఇతర పార్టీలలో బలమైన ప్రజాప్రతినిధులు, నాయకులు, ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు చాలామంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో పార్టీ బూత్ స్థాయిలో పటిష్టంగా మారింది. అంతకుముందు కొన్ని సంవత్సరాల నుంచి ఆయా మండలాలు, గ్రామాల్లో పాతుకుపోయి పేరుమోపిన నాయకులంతా టీఆర్ఎస్లో చేరడంతో ఇతర పార్టీలకు కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు నెలకొన్నాయి. చాలా ఎన్నికలను ఎదుర్కొన్న అనుభవమున్న నాయకులు టీఆర్ఎస్లో ఉండడంతో వారంతా ఈ ఎన్నికల్లో ఓటర్ను పోలింగ్ కేంద్రానికి రప్పించడానికి కృషి చేస్తున్నారు. నాలుగేళ్ల పాటు అధికారంలో ఉండటం, గత ప్రభుత్వాల హయాంలో కంటే ఎక్కువగా అభివృద్ధి, సంక్షేమ పధకాలను అమలు చేశాము కాబట్టి క్షేత్రస్థాయిలో ఓటర్ల మద్దతు తమకే ఉందని టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. రాజకీయ అనుభవం ఉన్న వారితో.. కాంగ్రెస్, టీడీపీలు 2014 ఎన్నికల వరకు ఉప్పు, నిప్పులా ఉన్న మారిన పరిస్థితుల నేపథ్యంలో రెండు పార్టీలు ఒక్కటై కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో నిలుచున్న విషయం తెలిసిందే. ఈ రెండు పార్టీలలో చాలాఏళ్లపాటు పనిచేసిన నాయకులు, పార్టీ మారినా రాజకీయంగా అనుభవమున్న వారితో పోల్ మేనేజ్మెంట్ చేయించే పనిలో కూటమి అభ్యర్థులు ఉన్నారు. పోల్ మేనేజ్మెంట్లో మొదటి నుంచి పట్టున్న టీడీపీ జతకట్టడంతో అధిష్టానం నుంచి ఆదేశాల మేరకు కూటమి అభ్యర్థులు పావులు కదుపుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమకు అనుకూలంగా మలుచుకునేందుకు కూటమి చర్యలు చేపట్టింది. మూడు దశాబ్దాలుగా వనపర్తి రాజకీయాల్లో ఉంటూ రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేయడంతో పాటు, ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన రావుల చంద్రశేఖర్ రెడ్డి మద్దతు కూడా చిన్నారెడ్డికి ఉండటంతో అది పోలింగ్‌లో ఉపయోగపడే అవకాశం ఉంది. ఇద్దరిదీ సుదీర్ఘ రాజకీయ అనుభవం వనపర్తి నియోజవర్గం బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి జిల్లెల చిన్నారెడ్డి 8వ సారి అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్నారు. 9వ సారి బరిలో ఉన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండడంతో ఓటర్లను ఆకర్శించడం, పోలింగ్ కేంద్రం వరకు తీసుకురావడంలో ఆయన దిట్ట. ఆయనకు తోడుగా ఎన్నికల సమయంలో అనుచరులు అధిక సంఖ్యలో రంగంలోకి దిగుతారు. టీఆర్ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి 2001 నుంచి కేసీఆర్ వెంట ఉద్యమంలో పాల్గొన్న అనుభవం, నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులుగా పని చేయడంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకున్నాడు. 2001కి ముందు తెలుగుదేశం పార్టీలో పనిచేసిన ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ఖాదీబోర్డు చైర్మన్‌గా పనిచేశారు. మొత్తానికి నిరంజన్‌రెడ్డికి మూడు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉండడంతో ఆయన కూడా ఓటర్ల నాడిని పసిగట్టడంలో ముందుంటాడు. -
రెండు విడతల్లో పాలమూరు – రంగారెడ్డి
సాక్షి, గద్వాల: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండు విడతల్లో పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు రాహూల్‌గాంధీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మధ్యాహ్నం గద్వాలలో మహాకూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి మండల కేంద్రంలో 30 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేస్తామన్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రధాని మోదీకి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మద్దతిచ్చారని, దేశ ప్రజలను ఎన్నో కష్టాల పాల్జేసిన నోట్ల రద్దుకు వత్తాసు పలికారని, బీడీ కార్మికుల యాజమాన్యాలకు నష్టం కలిగించిన జీఎస్టీని కొనియాడారని విమర్శించారు. ‘కేసీఆర్‌కు ఒకే లక్ష్యం ఉంది.. తెలంగాణలో తన కుటుంబం, కేంద్రంలో మోదీ పరిపాలించాలి.. టీఆర్ఎస్ పేరుకు మరో ఎస్ జోడించాలని, ఇది టీఆర్ఎస్ కాదు.. టీ..ఆర్ఎస్ఎస్ పార్టీ..’ అని ఎద్దేవా చేశారు. మోదీ, కేసీఆర్ చీకటి ఒప్పందాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఢిల్లీ నుంచి మోదీని.. తెలంగాణ నుంచి కేసీఆర్‌ను తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయన్నారు. రాష్ట్రంలో కేసీఆర్, కేంద్రంలో మోదీ అభివృద్ధి నిరోధకులుగా మారారన్నారు. రాష్ట్రంలో ఎక్కడా చూసినా కేసీఆర్ అవినీతి కనిపిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకకాలంలో రూ.2 లక్షల రైతు రుణమాఫీ, 22 లక్షల మందికి డబుల్ బెడ్రూం ఇళ్లు, ప్రతి పేదోడి ఇంటికి రూ.5 లక్షలు సాయం అందిస్తామన్నారు. 20 శాతం నిధులు విద్యారంగానికి కేటాయిస్తామని, ఎస్సీ వర్గీకరణ చేస్తామని, మహాకూటమిని గెలిపించాలని రాహుల్‌గాంధీ కోరారు. తెలంగాణ తల్లి.. సోనియాగాంధీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించి పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన తెలంగాణ తల్లి సోనియాగాంధీ అని మాజీ మం త్రి, కాంగ్రెస్ గద్వాల ఎమ్మెల్యే అభ్యర్థి డీకే అరుణ కొనియాడారు. ఎన్నికల ముందు రైతులను మోసం చేయడానికి రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రూ.2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చుతామన్నారు. 371(జే) గద్వాలకు ప్రత్యేక హోదా కల్పించి ప్రత్యేక ప్యాకేజీని అమలు చేసేందుకు కృషిచేస్తామన్నారు. నా హయాంలోనే అభివృద్ధి మంత్రి, ఎమ్మెల్యేగా తన హయాంలోనే గద్వాల నియోజక వర్గ అభివృద్ధి జరిగిందని డీ.కే.అరుణ వెల్లడించారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఉన్నా, లేకున్నా ప్రజల సమస్యల్లో పాలుపంచుకుంటూ అభివృద్ధి చేశానని వెల్లడించారు. మాజీ మంత్రి డీకే సమరసింహారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో అసమర్థ పాలన కారణంగా ముందస్తు ఎన్నికలు వచ్చాయని విమర్శించారు. కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ఇంటి పార్టీ నాయకుడు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ నడిగడ్డ భవిష్యత్ కోసం కాంగ్రెస్ అభ్యర్థి డీకే అరుణను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జ్ కుంతియా, నాయకులు సలీంఅహ్మద్, నర్సిరెడ్డి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు సుధాకర్, నాగర్‌కర్నూల్ ఎంపీ నంది ఎల్లయ్య, కేంద్ర మాజీ మంత్రి సూర్యప్రకాష్‌రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి సంపత్‌కుమార్, నాయకులు డీకే స్నిగ్ధారెడ్డి, శివసేనారెడ్డి, కృష్ణవేణి, రామాంజనేయులు, పద్మావతి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. కూటమిని గెలిపించండి ప్రజా యుద్ధనౌక గద్దర్ మాట్లాడుతూ.. ‘మా భూములు, మా నీళ్లు, మా నిధులు మాకు కావాలి..’ అనే నినాదంతో పోరాడి తెలంగాణ తెచ్చుకుంటే.. పాలకుల నిర్లక్ష్యానికి ఏ ఒక్కటీ నెరవేరలేదన్నారు. సభకు వచ్చిన జనాన్ని చూస్తుంటే మహాకూటమి కచ్చితంగా విజయం సాధిస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలపించిన పాటకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. -
టీఆర్ఎస్ పాలనలో ప్రజలంతా విసిగిపోయారు..
సాక్షి, గోపాల్పేట: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని వనపర్తి ఎమ్మెల్యే అభ్యర్థి జి.చిన్నారెడ్డి ధీమా వ్యక్తంచేశారు. శనివారం ఆయన నాగం తిరుపతిరెడ్డితో కలిసి గోపాల్పేట మండల కేంద్రంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికావద్దన్నారు. టీఆర్ఎస్ పాలనలో ప్రజలంతా విసిగిపోయారని, ఓటు వేసే పరిస్థితిలో లేరని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఆర్నెళ్లలోనే లక్ష ఉద్యోగాలను భర్తీచేస్తామని స్పష్టంచేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళా సంఘాల్లో ఉన్న వారికి రూ.50వేల చొప్పున రుణమాఫీ చేస్తామని తెలిపారు. తెల్లకార్డున్న ప్రతి ఒక్కరికీ సన్నబియ్యం అందిస్తామన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందిస్తామని చెప్పారు. సుధాకర్, రమేష్ ఆధ్వర్యంలో ఇతర పార్టీలకు చెందిన సుమారు 80 మంది చిన్నారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం చెన్నారంలో రాంచందర్ ఆద్వర్యంలో ఇంటింటి ప్రచారం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు గణేష్ గౌడ్, మురళిగౌడ్, జెడ్పీటీసీ రాజేశ్వర్‌రెడ్డి, ఎస్సీసెల్ కన్వీనర్ కొంకి వెంకటేష్, బాలస్వామి, అమర్ పాల్గొన్నారు. -
జల సిరి.. ఓట్లు మరి ?
సాక్షి, వనపర్తి: ఉమ్మడి పాలమూరు జిల్లా.. పేరు వినగానే కరువు కాటకాలు, వలస కార్మికులు గుర్తుకొస్తారు.. తలాపున కృష్ణమ్మ బిరబిరా ప్రవహిస్తున్నా తాగునీటికి తిప్పలు అన్నీఇన్ని కావు. ఏటా వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎక్కువగా మెట్ట పంటలను సాగుచేసేవారు. ఆశించిన స్థాయిలో వర్షాలు కురిస్తే పంట చేతికొచ్చేది లేదంటే అప్పులే మిగిలేవి. కానీ ప్రస్తుతం పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చింది. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, భీమా ఫేజ్ 1, భీమా ఫేజ్ 2 పనులు శరవేగంగా కొనసాగి.. ఆయన మరణానంతరం నెమ్మదించాయి. 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్‌గా మార్చారు. అసంపూర్తిగా మిగిలిన పనులను పూర్తిచేసి వాగులు, వంకలు, అందుబాటులో ఉన్న కాల్వల ద్వారా చెరువులు, కుంటలను నింపుతున్నారు. దీంతో వనపర్తి నియోజకవర్గం పరిధిలో 70వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఫలితంగా ఎన్నో ఏళ్లుగా వలసలపై ఆధారపడ్డ చాలామంది సొంతూరుకు తిరిగి వస్తున్నారు. ఉన్న ఎకరా, రెండెకరాల పొలంలో పంటలు సాగుచేసుకుని స్థానికంగా కూలీ పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో సాగునీటి అంశం కీలకంగా మారింది. నేతాలంతా తామంటే తాము సాగునీరు ఇచ్చామని చెప్పుకుంటున్నారు. వైఎస్ హయాంలోనే కేఎల్ఐ పనులు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనులకు 1984లో సర్వేచేయగా, 1991లో నాగర్‌కర్నూల్‌లో కల్వకుర్తి, నెట్టెంపాడు పథకాలకు కలిపి సర్కిల్ కార్యాలయాన్ని ప్రారంభించారు. 1999లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేగుమాన్గడ్డ వద్ద శిలాఫలకం వేసినా పనులు ముందుకు సాగలేదు. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జలయజ్ఞంలో భాగంగా కేఎల్ఐ, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ పనులను ప్రారంభించారు. కేఎల్ఐ పథకానికి 2014 సంవత్సరానికి ముందు రూ.2,716.23 కోట్లు ఖర్చుచేయగా టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.1,196కోట్ల వ్యయంతో పనులు చేపట్టారు. పనులు చివరి దశలో ఉన్నాయి. రాజీవ్‌భీమా పథకానికి మొత్తం రూ.2,316 కోట్లు ఖర్చుచేయగా, 2014కు ముందు రూ.1,953 కోట్లు, ఆ తర్వాత రూ.363కోట్లు ఖర్చుచేశారు. 2014కు ముందు ఈ రెండు పథకాల కింద ఆయకట్టు సైతం తక్కువగా ఉంది. అప్పటికీ పనులు పూర్తి కాకపోవడంతో ఆయకట్టు పెరగలేదు. కేఎల్ఐ కింద 2014 వరకు 13,000 ఎకరాల ఆయకట్టు ఉండగా, ప్రస్తుతం 3.50 లక్షల ఎకరాలకు చేరింది. రాజీవ్ భీమా కింద 2014 వరకు 12వేల ఎకరాల ఆయకట్టు ఉండగా ప్రస్తుతం 1.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 2014 వరకు కేఎల్ఐ, భీమా, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు ప్రాజెక్టుల కింద సుమారు 40వేల ఎకరాల ఆయకట్టు ఉండేది. కానీ ఈ ఏడాది ఖరీప్ సీజన్ నాటికి ఉమ్మడి జిల్లాలో సుమారు 7లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించినట్లు నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. వనపర్తికి జలసిరి కేఎల్ఐలో ముందుగా 25 టీఎంసీల నీటి కేటాయింపులు ఉండేవి. తెలంగాణ ఏర్పాటు తర్వాత దానిని 40 టీఎంసీలకు పెంచారు. దాని ఫలితంగానే నేడు జిల్లాలోని ఖిల్లాఘనపురం బ్రాంచ్ కెనాల్, పెద్దమందడి బ్రాంచ్ కెనాల్లు చేపట్టడానికి అవకాశం ఏర్పడింది. ఈ రెండింటి కింద సుమారు 45వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో వలసలకు నిలయంగా ఉన్న ఖిల్లాఘనపురం, పెద్దమందడి, గోపాల్పేట, వనపర్తి మండలాల నుంచి ఈ కాల్వలు వెళ్తుండటంతో నేడు నియోజకవర్గంలోని వేల ఎకరాల భూములు సాగులోకి వచ్చాయి. వర్షాలు కురువకపోయినా ప్రస్తుతం అనేక చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపారుతున్నాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా వరి, వేరుశనగ పంటలతో పచ్చగా కనిపిస్తుంది. రైతుల ఓటు ఎటు వైపు? తాము ముందుగా అధికశాతం ప్రాజెక్టు పనులను పూర్తిచేయడంతోనే సాగునీరు వచ్చిందని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఉండకపోతే ఎప్పటికీ ఈ ప్రాజెక్టుల పనులు పూర్తయ్యేవి కాదని, సాగునీరు అందడం పాలమూరు రైతుల కు కలగానే మిగిలిపోయేదని టీఆర్ఎస్ నా య కులు అంటున్నారు. వనపర్తి నియోజకవర్గం లోని ఖిల్లాఘనపురం, పెద్దమందడి, గోపాల్పేట, రే వల్లి, వనపర్తి మండలాల్లో కేఎల్ఐ, భీమా కాల్వల ద్వారా నీరు వచ్చింది. మరి ఎన్నికల్లో ఓటు వేసే ముందు రైతులు ఎవరి వైపు మొగ్గు చూపుతారనే చర్చ అంతటా కొనసాగుతోంది. కాంగ్రెస్ నుంచి జిల్లెల చిన్నారెడ్డి, టీఆర్ఎస్ నుంచి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఎన్నికల బరిలో ఉన్నారు. విజయం ఎవరిని వరిస్తుందో వేచిచూడాల్సిందే. -
9నెలల ముందే కాడి వదిలేశారు...
సాక్షి, వనపర్తి : నాలుగున్నరేళ్లలో ప్రజాసంక్షేమాన్ని విస్మరించిన టీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ అభ్యర్థి జి.చిన్నారెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. బుధవారం వనపర్తి మండలం మెంటెపల్లి, కడుకుంట్ల, పెద్దగూడెం, కిష్టగిరి గ్రామాల్లో మహాకూటమి నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కోరారు. పాలన చేతకాక ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్‌కు భంగపాటు తప్పదన్నారు. ఈ ఎన్నికల్లో అధిక మెజార్టీతో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రైతులందరికీ పంట రుణమాఫీ, బీమా సౌకర్యం, పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని భరోసా ఇచ్చారు. జెడ్పీటీసీ వెంకటయ్య యాదవ్, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి, మాజీ సర్పంచ్ జానకి కొండన్న, సహదేవ్ యాదవ్, మాసిరెడ్డి, తిరుపతయ్య, జనార్దన్ పాల్గొన్నారు. ఖిల్లాఘనపురం: వనపర్తి నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యేగా 20 ఏళ్లపాటు పనిచేసి ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టిన తన తండ్రి ఏనాడూ అవినీతి, అక్రమాలకు అవకాశం ఇవ్వలేదని, ఆయనంటే ప్రజలకు ఓ నమ్మకమని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి కుమారుడు ఆదిత్యారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని మామిడిమాడ, ముందలితండా, వెనికితండాల్లో ఆయన మండల సింగల్‌విండో అధ్యక్షుడు రవిందర్‌రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, నాయకులు బాలకృష్ణారెడ్డి తదితరులతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి చేతిగుర్తుకు ఓటువేసి చిన్నారెడ్డిని గెలిపించాలని కోరారు. సీఎం కేసీఆర్ మోసపూరిత హామీలు ఏ ఒక్కటీ నెరవేరలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగుల కోసం మెగా డీఎస్సీ వేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు పోల్‌శెట్టి శ్రీను, బండారి శ్రీను, బండారి యాదయ్య, డాక్టర్ నరేందర్‌గౌడ్, నాగేశ్వర్, కృష్ణయ్య యాదవ్, జయాకర్, బాల్‌రాజు, దేవిజానాయక్, గోవింద్‌నాయక్, రాజు, మాసయ్య పాల్గొన్నారు. -
బుజ్జగింపుల్లేవ్!
సాక్షి, వనపర్తి: ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన వారు లేరు. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులపై తిరుగుబాటు బావుటా ఎగరవేసి ధైర్యంగా నామినేషన్ దాఖలు చేసినవారు లేరూ.. దీంతో నామినేషన్ల ఉపసంహరణ దశలో వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎలాంటి బుజ్జగింపుల పర్వానికి ఎలాంటి ఆస్కారం లేదని స్పష్టమవుతోంది. గత కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ రెబల్స్‌గా నామినేషన్ వేసిన దాఖలాలు లేవు. ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులంతా ప్రధాన పార్టీలకు చెందినవారు కావడం, పైగా, రాష్ట్ర, జాతీయస్థాయి హోదాలో పలుకుబడి కలిగిన నేతలు ఉండటంతో తిరుబాటుదారుల భయం లేదని చెప్పొచ్చు. బరిలో నిలిచేదెవరో? ఎన్నికల్లో వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఈనెల 19వ తేదీ వరకు 18 మంది 39 నామినేషన్లు దాఖలు చేశారు. పరిశీలనలో అఫిడవిట్లో లోపాలు ఉన్నాయని ఆరుగురి నామినేషన్లను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. 12 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాట అయ్యాయి. వీరిలో టీఆర్ఎస్, మహాకూటమి, బీజేపీ అభ్యర్థులతో పాటు పలు జాతీయ పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థుల నామినేషన్లు ఉన్నాయి. నామినేషన్ల ఉపసంహరణకు బుధవారం మొదటిరోజు గడువు పూర్తయింది. ఇప్పటి వరకు ఏ ఒక్కరు నామినేషన్లను వెనక్కి తీసుకోలేదు. అభ్యర్థులు వీరే.. బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) నుంచి సత్యం సాగరుడు, బీజేపీ నుంచి కొత్త అమరేందర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి డాక్టర్ జి.చిన్నారెడ్డి, టీఆర్ఎస్ నుంచి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, బహుజన లెఫ్ట్ పార్టీ నుంచి జి.క్రిష్ణయ్య, సమాజ్‌వాదీ పార్టీ అక్కల బాబుగౌడ్, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి సీఆర్. మునిస్వామి, స్వతంత్ర అభ్యర్థులు పుట్ట ఆంజనేయులు, పోల ప్రశాంత్, బూజుల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్.రాజ్‌కుమార్, విష్ణువర్ధన్‌రెడ్డి నామినేషన్లు చెల్లుబాటు అయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఇండిపెండెంట్‌గా టీజేఎస్ నేత మహాకూటమితో జతకట్టిన ప్రొఫెసర్ కోదండరాం పార్టీ తెలంగాణ జన సమితిలో పార్టీ ఆవిర్భావం నుంచీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్న మద్దిరాల విష్ణువర్ధన్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తాను కూడా పోటీలో ఉంటాననే సందేశం బుధవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలాఉండగా, ఇండిపెండెంట్ అభ్యర్థులు ప్రధానపార్టీల ఓట్లను తీల్చే అవకాశం ఉండదని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎవరి బలం ఏమిటో తేలాలంటే డిసెంబర్ 11న నిర్వహించే ఓట్ల లెక్కింపు దాకా ఆగాల్సిందే. -
మహకూటమితోనే అభివృద్ధికి బాటలు..
సాక్షి, ఆత్మకూర్: రాష్ట్ర ప్రజలను మోసంచేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలంటే మహాకూటమిని గెలిపించాలని మహాకూటమి అభ్యర్థి కొత్తకోట దయాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కె.వీరారెడ్డి అన్నారు. ఆదివారం ఆత్మకూర్ మండలంలోని బాలకిష్టాపూర్, పిన్నంచర్ల, మూళమల్లలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మహాకూటమి అధికారంలోకి వస్తే పెన్షన్లను డబుల్ చేస్తామని, ఇంటి స్థలం ఉన్న వారందరికీ ఇంటినిర్మాణం కోసం రూ.5లక్షలు మంజూరు చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు బాలకిష్టన్న, కాంగ్రెస్, టీడీపీ నాయకులు అయూభ్‌ఖాన్, రామలక్ష్మారెడ్డి, రహ్మతుల్లా, బాలకిష్ణారెడ్డి, ఎస్టీడీ శ్రీను, అశ్విన్‌కుమార్, పుట్నాల రమేష్, వెంకటేష్, శేఖర్, గంగాధర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వండిపెడతా.. ఓటేయమ్మా.. రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహాకూటమి అభ్యర్థి కొత్తకోట దయాకర్ రెడ్డి ఆత్మకూర్ మండలంలోని గోపన్‌పేట గ్రామంలో వంటింట్లోకి వెళ్లిమరీ వంటచేస్తు తనకు ఓటువేయాలని అభ్యర్థించారు. టీఆర్ఎస్ను సాగనంపాలి మదనాపురం: కల్లబొల్లి హామీలతో గద్దెనెక్కిన టీఆర్ఎస్ను సాగనంపాలని మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని కరివెన, గోపన్‌పేటలో ఇంటింటి ప్రచారం చేశారు.కార్య క్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు బాలకిష్టన్న, టీడీపీ మండల అధ్యక్షుడు నాగన్న యాదవ్, బాలకిష్ణారెడ్డి, రామలక్ష్మారెడ్డి, ఎస్టీడీ శ్రీను, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. చిన్నారెడ్డి గెలుపునకు పూజలు పెబ్బేరు: మండలంలోని సూగూర్‌లో కాంగ్రెస్ నాయకులు నర్సింహ్మనాయుడు ఆధ్వర్యంలో ఆదివారం రామాలయంలో పూజలు చేశారు. వనపర్తి నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చిన్నారెడ్డి గెలువాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్‌లో మచ్చలేని నాయకుడని కొనియాడారు. మళ్ళీ అధికారంలోకి వస్తే ఇంకా అభివృద్ధి పనులు జరుగుతాయని తెలిపారు. హస్తం గుర్తుకే ఓటు వేసి భారీ మోజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామలక్ష్మన్, బుచ్చన్నయాదవ్, మండగిరి రాముడు, గోవిందు, మధు పాల్గొన్నారు. -
నామినేషన్ ఫైట్.. నేతల బల ప్రదర్శన..!
సాక్షి, వనపర్తి: నామినేషన్ దాఖలు చేసిన రోజే తమ జనబలాన్ని ప్రదర్శిస్తే ఇక గెలిచినట్లేనని రాజకీయ పరిభాషలో చెబుతుంటారు. అలాంటి సందర్భం కోసమే ప్రస్తుతం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో కొన్నేళ్లుగా ఇదే సంస్కృతి కొనసాగుతోంది. అదే తరహాలో మహాకూటమి అభ్యర్థి, వనపర్తి తాజామాజీ ఎమ్మెల్యే డాక్టర్ జి.చిన్నారెడ్డి శనివారం నామినేషన్ దాఖలు చేసేందుకు భారీగా జనసమీకరణ చేస్తున్నట్లు సమాచారం. శుక్రవారం జిల్లా టీడీపీ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ రోజున రావాలని శ్రేణులను కోరినట్లు తెలిసింది. ఐదోరోజు శుక్రవారం వరకు ఆరుగురు నామినేషన్లు దాఖలు చేశారు. అ«ధికారపార్టీ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి రెండుసెట్ల నామినేషన్లు, స్వతం త్ర అభ్యర్థులు మూడుసెట్ల నామిషన్లు, సమాజ్‌వాది పార్టీ నుంచి అక్కల బాబుగౌడ్ నామినేషన్ వేశారు. ఆరో రోజు తాజామాజీ ఎమ్మెల్యే డాక్టర్ జి.చిన్నారెడ్డి, బీజేపీ అభ్యర్థి కొత్త అమరేందర్‌రెడ్డితో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు ముహూర్తం నిర్ణయించుకున్నారు. రోజు మూడురోజులుగా భారీ సంఖ్యలో జనసమీకరణలో నిమగ్నమయ్యారు. ఏర్పాట్లలో నాయకులు 2014 ఎన్నికల సమయంలో చిన్నారెడ్డి స్థానిక పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో వేల సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో జనసమీకరణ చేసి అక్కడి నుంచి ర్యాలీగా ఆర్ఓ కార్యాలయం వరకు వెళ్లారు. ప్రధాన కూడళ్ల గుండా ర్యాలీలు, నృత్యాలు చేస్తూ డప్పులు కొడుతూ ఒంటెలు, ఎద్దుల ప్రదర్శనలతో నియోజకవర్గంలో తన బలాన్ని ప్రదర్శిస్తూ నామినేషన్‌కు బయలుదేరారు. అదే తరహాలో టీఆర్ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సైతం 2014లో నామినేషన్ వేశారు. కానీ ఈసారి ఎన్నికల సందర్భంగా నిరంజన్‌రెడ్డి ట్రెండ్ మార్చి అతి సాధారణంగా ఆలయాల్లో పూజలు చేసి నలుగురు వ్యక్తులతో కలిసి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. మరోసారి నామినేషన్ వేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
కలిసొచ్చిన వీధిపోటు !
సాక్షి, వనపర్తి : ఏఐసీసీ కార్యదర్శి, వనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ జి.చిన్నారెడ్డికి తూర్పు వీధిపోటు కలిసొస్తోంది. 1985లో వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగిన ఆయన ఇప్పటి వరకు నాలుగుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. రెండేళ్లు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశారు. వనపర్తి నియోజకవర్గం నుంచి గడిచిన ఆరు దశాబ్దాల్లో మంత్రిగా పని చేసిన ఏకైక వ్యక్తిగా చిన్నారెడ్డికి గుర్తింపు ఉంది. ప్రత్యక్ష ఎన్నికలకు రాకమునుపు యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసి నాటి ప్రధాన మంత్రి రాజీవ్‌గాంధీ వద్ద ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఏడుసార్లు పోటీ చేసి నాలుగుసార్లు గెలుపొందారు. వాస్తుపై నమ్మకం మొదటి నుంచి చిన్నారెడ్డికి వాస్తుపై నమ్మకం ఎక్కువే. స్వగ్రామమైన గోపాల్పేట మండలం జయన్న తిరుమలాపురంలోని చిన్నారెడ్డి ఇంటికి తూర్పు వీధిపోటుతో ఉంటుంది. గత 25 ఏళ్ల క్రితం వనపర్తి పట్టణంలో ఇంటిని సైతం తూర్పు వీధిపోటు వచ్చేలా నిర్మించుకున్నారు. సూర్యనారాయణుడు ఉదయించిన వెంటనే తమ ఇంటిలోకి కిరణాలు రావాలని.. తద్వారా ఆ ఇల్లూ.. ఇంట్లోని వారు ప్రకాశిస్తారని ఆయన నమ్మకం. అందుకే గడిచిన ఏడు పర్యాయాలు ఎన్నికల ప్రచారం, ఇతరత్రా పనులను ఇక్కడి నుంచే ప్రారంభిస్తారు. కాగా, చిన్నారెడ్డి 2009 ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు నాటి ఏఐసీసీ అధ్యక్షురాలు సో నియాగాంధీ పిలిచి మరీ ఏఐసీసీ కార్యదర్శి పదవి ఇచ్చి ప్రోత్సహించారు. దీంతో రెట్టింపు ఉత్సాహంతో పని చేయగా.. 2014లో రాష్ట్రంలో ఎక్కువగా టీఆర్ఎస్ హవా ఉన్నా.. వనపర్తిలో మాత్రం చిన్నారెడ్డి గెలుపొందారు. -
జూన్ నాటికి 1400ఇళ్లు పూర్తి
వనపర్తి/పెద్దమందడి(ఖిల్లాఘనపురం): జూన్ నాటికి వనపర్తి నియో జకవర్గంలో 1400 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయడం జరుగుతుందని 2019 ఎన్నికల నాటికి మరో 2వే ల ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలం లోని మంగంపల్లిలో ఎమ్మెల్యే చిన్నారెడ్డితో కలిసి డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. గ్రామానికి 20ఇళ్లు మంజూరయ్యాని తెలిపారు. అవసరమై న ప్రతి గ్రామానికి మంజూరు చేస్తామన్నారు. నిరుపేదల కోసం నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణాలు నాణ్యతతో, సకాలంలో నిర్మించి ఇవ్వాలని ఎమ్మెల్యే చిన్నారెడ్డి తెలిపారు. అవసరమైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్లు మం జూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ దయా కర్, ఖిల్లాఘనపురం వైస్ ఎంపీపీ ఉమామహేశ్వరి, కాంగ్రెస్ జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి గిరిజాదేవి, నాయకులు సత్యారెడ్డి, బుచ్చిలింగం, రవీందర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయ కులు మేఘారెడ్డి, సర్పంచ్ శ్రీలత, సింగల్‌విండో అధ్యక్షుడు విట్టా శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వారిపై అనర్హత వేటు వేయండి: టీ.కాంగ్రెస్
హైదరాబాద్ : పెంచిన విద్యుత్,ఆర్టీసీ చార్జీలను కెసిఆర్ సర్కార్ తక్షణమే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి చిన్నారెడ్డి డిమాండ్ చేశారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ ఛార్జీల పెంపుపై ప్రభుత్వం దిగి రాకపోతే ఇతర పార్టీలను కలుపుకుని కాంగ్రెస్ ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తుందన్నారు. ఆదాయం పెరుగుతోందన్న ప్రభుత్వ పెద్దలు ఆ రాబడితో విద్యుత్, ఆర్టీసీ లోటును భర్తీ చేయాలన్నారు. మిషన్ భగీరథ,పాలమూరు రంగారెడ్డి,కాళేశ్వరం ప్రాజెక్టు ల నిర్మాణ అంచనాలను ప్రభుత్వం ఇష్టానుసారంగా పెంచడం వల్ల ఖజానా పై బారం పడుతుందన్నారు. కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకే ప్రభుత్వం ఇలా ప్రాజెక్టు వ్యయాన్ని పెంచుతుందని చిన్నారెడ్డి విమర్శించారు. అంతకు ముందు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు చిట్టం రామ్మోహన్ రెడ్డి, పువ్వాడ అజయ్‌లపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ నేతలు గీతారెడ్డి, చిన్నారెడ్డి, సంపత్, పద్మావతి ఉత్తమ్, వంశీచంద్‌రెడ్డి తరతరులు స్పీకర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ విప్ సంపత్ మాట్లాడుతూ తెరాసలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే లు చిట్టం రామ్ మోహన్ రెడ్డి,పువ్వాడ అజయ్ లపై అనర్హత వేటు వేయలంటూ స్పీకర్ మధుసూధనా చారికి ఫిర్యాదు చేశామన్నారు. ఆధారాలతో సహా పిటిషన్ సమర్పించినట్లు చెప్పారు. రెండేళ్లుగా తెరాస ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్యంతో పాటు నైతిక విలువలను,రాజ్యాంగ స్పూర్తిని ఖునీ చేస్తోందని సంపత్ మండిపడ్డారు. డిస్ క్వాలిఫికేషన్ల పిటిషన్లపై స్పీకర్ స్పందించకపోవడంతో సుప్రీంకోర్టు ను ఆశ్రయించినట్లు చెప్పారు. జులై 1 న ఈ కేసు విచారణకు రానున్నదని తెలిపారు. డబ్బు సంచులకో, ప్రలోభాలకో,తెరాస బ్లాక్ మెయిలింగ్కో లొంగిపోయి ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తున్నారన్నారు. ఫిరాయించిన ఎమ్మెల్యే లపై అనర్హత వేటు వేయలంటూ తాము పిటిషన్ లు ఇచ్చినప్పటికీ స్పీకర్ స్పందించడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, పీఏసీ చైర్మన్ గీతారెడ్డి అన్నారు. ఫిరాయించిన ఎమ్మెల్యే లకు స్పీకర్ ఆఫీసు ఇప్పటివరకు నోటీసులే ఇవ్వలేదన్నారు. ఫిరాయింపు నిరోధక చట్టంను అమలు చేయాల్సిన స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేస్తూ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఫిరాయింపుదారులపై నిర్ణయం తీసుకోకుండా రాజ్యాంగాన్ని బుట్టదాఖలు చేయడం ఎంతవరకు సమంజసమని గీతారెడ్డి ప్రశ్నించారు. -
ఎమ్మెల్యేపై అధికార పార్టీ నేతల దాడి
-
ఎమ్మెల్యేపై అధికార పార్టీ నేతల దాడి
కాంగ్రెస్ పార్టీకి చెందిన వనపర్తి ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డిపై అధికార టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసే విషయంలో ఎమ్మెల్యే చిన్నారెడ్డికి, స్థానిక మండల పరిషత్ అధ్యక్షుడు కృష్ణానాయక్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వివాదంలో ఎమ్మెల్యే చిన్నారెడ్డిని టీఆర్ఎస్ కార్యకర్తలు తోసేసి గాయపరిచారు. దాంతో చిన్నారెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దాడి హేయమైన చర్య కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డిపై దాడి హేయమైన చర్య టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అభివృద్ధి పనుల శంకుస్థాపనలో అధికారులు ప్రొటోకాల్ తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు. ఎమ్మెల్యే చిన్నారెడ్డిపై దాడి చేసిన వారిని శిక్షించాలంటూ స్పీకర్‌ను మంగళవారం కలువనున్నట్టు ఆయన తెలిపారు. -
'వ్యంగ్యం.. ఆనక క్షమాపణ ఆయనకు అలవాటే'
-
'వ్యంగ్యం.. ఆనక క్షమాపణ ఆయనకు అలవాటే'
మంత్రి జగదీష్ రెడ్డి వ్యంగ్యంగా మట్లాడి తనను అవమానపరిచారని కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి అన్నారు. ఆయన ఇంతకుముందు కూడా నోరు పారేసుకుని, ఆ తర్వాత క్షమాపణ చెప్పారని గుర్తుచేశారు. తెలంగాణ సాధన కోసం తాను చేసిన కృషి ఏంటో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అడిగితే చెబుతారని.. ఇప్పటికైనా జగదీష్ రెడ్డి తన తప్పేంటో తాను తెలుసుకుని.. హుందాగా మాట్లాడాలని అన్నారు. రేవంత్ రెడ్డిని సభలో మాట్లాడనీయమన్న టీఆర్ఎస్ మంత్రులు.. అదే పార్టీ సభ్యులు అలా చేస్తే ఎలా సమర్థిస్తారని చిన్నారెడ్డి ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికో న్యాయం.. వారికో న్యాయం అమలుచేస్తారా అంటూ నిలదీశారు. -
'మీలాగా ఆంధ్రా నేతల బూట్లు నాకలేదు'
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో బుధవారం గందరగోళం నెలకొంది. మంత్రి జగదీశ్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకె అరుణల మధ్య మరోసారి మాటల యుద్ధం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లాలో విద్యుత్ ప్రాజెక్ట్ అంశంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ సభ్యుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈనేపథ్యంలో డీకె అరుణ మాట్లాడుతూ తొలిసారి గెలిచి ఎమ్మెల్యేగా సభకు వచ్చిన జగదీశ్ రెడ్డి చాలా నేర్చుకోవాలని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి ...ఆంధ్రా నేతల బూట్లు నాకారని కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి అన్నారు. దాంతో జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన జగదీశ్ రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం చుట్టుముట్టి నిరసన వ్యక్తం చేశారు. దీనిపై స్పీకర్ మధుసుదనాచారి మాట్లాడుతూ అభ్యంతరకర పదాలను రికార్డుల నుంచి తొలగిస్తామన్నారు. మరోవైపు జగదీశ్ రెడ్డి కూడా తాను కేసీఆర్ చలవ వల్ల, సూర్యాపేట ప్రజల ఆశీస్సులతో మంత్రినయ్యానన్నారు తన వ్యాఖ్యల్లో తప్పుంటే రికార్డుల నుంచి తొలగించాలని అన్నారు. దాంతో సభలో గందరగోళం నెలకొనటంతో స్పీకర్ సభను పదినిమిషాల పాటు వాయిదా వేశారు. -
శాసనసభ నుంచి కాంగ్రెస్ వాకౌట్
-
శాసనసభ నుంచి కాంగ్రెస్ వాకౌట్
హైదరాబాద్ : రైతు రుణమాఫీ అంశంపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ సోమవారం అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. రుణమాఫీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వనందున వాకౌట్ చేస్తున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రకటించారు. మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా లక్ష లోపు రుణాలు మాఫీ చేయాలని కోరితే... అనువాదంలో తప్పు జరిగిందని తప్పించుకున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి మండిపడ్డారు.