20 లక్షల ఎకరాలు ఎండిపోయాయంటూ తప్పుదోవ పట్టిస్తున్నారు: చిన్నారెడ్డి
సుందరయ్య విజ్ఞాన కేంద్రం (హైదరాబా ద్): రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలు ఎండిపోయాయంటూ బీఆర్‌ఎస్ పార్టీ అధి నేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్య క్షు డు డాక్టర్ జి.చిన్నారెడ్డి ఆరోపించారు. గత వర్షాకా లంలో తక్కువ వర్షపాతం ఉండటం వల్ల సుమారు రెండు లక్షల ఎకరాల వరకు ఎండిపోయి ఉంటా యని, కానీ వాటిని ఎక్కువగా చూపుతూ రైతులను తప్పు దోవ పట్టిస్తున్నారని విమర్శించారు.
ఆదివా రం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ వ్యవసాయ శాఖ విశ్రాంత అధికారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ అధికారుల సంక్షేమ సంఘం చైర్మన్, రిటైర్డ్ సంయుక్త వ్యవసాయ సంచాలకులు భోమిరెడ్డి కృపాకర్‌రెడ్డి జన్మది నాన్ని పురస్కరించుకుని ఆత్మీయ సత్కారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిన్నారెడ్డి మాట్లాడుతూ, రానున్న పార్ల మెంటు ఎన్నికలలో లబ్ధిపొందేందుకు రైతులను, ప్రజలను ప్రతిపక్షాలు తప్పు దారి పట్టిస్తున్నాయని విమర్శించారు.
రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని, వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ సంస్థల అభివృద్ధికి తమవంతుగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ విశ్రాంత వ్యవసాయ శాఖ అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు డాక్టర్ రంగారెడ్డి అధ్యక్షతన జరిగి న ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి చంద్రశేఖ ర్, తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం అధ్యక్షులు డాక్టర్ వైద్యనాథ్, ప్రధాన కార్యదర్శి జి. కృపాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కు మార్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సి.ఆర్.బిస్వాల్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కృపాకర్‌రెడ్డి దంపతులను ఘనంగా సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment