కాంగ్రెస్ పార్టీకి చెందిన వనపర్తి ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డిపై అధికార టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాడి చేశారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన వనపర్తి ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డిపై అధికార టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసే విషయంలో ఎమ్మెల్యే చిన్నారెడ్డికి, స్థానిక మండల పరిషత్ అధ్యక్షుడు కృష్ణానాయక్కు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వివాదంలో ఎమ్మెల్యే చిన్నారెడ్డిని టీఆర్ఎస్ కార్యకర్తలు తోసేసి గాయపరిచారు. దాంతో చిన్నారెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
దాడి హేయమైన చర్య
కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డిపై దాడి హేయమైన చర్య టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అభివృద్ధి పనుల శంకుస్థాపనలో అధికారులు ప్రొటోకాల్ తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు. ఎమ్మెల్యే చిన్నారెడ్డిపై దాడి చేసిన వారిని శిక్షించాలంటూ స్పీకర్ను మంగళవారం కలువనున్నట్టు ఆయన తెలిపారు.