ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి
సాక్షి, వనపర్తి : నాలుగున్నరేళ్లలో ప్రజాసంక్షేమాన్ని విస్మరించిన టీఆర్‌ఎస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ అభ్యర్థి జి.చిన్నారెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. బుధవారం వనపర్తి మండలం మెంటెపల్లి, కడుకుంట్ల, పెద్దగూడెం, కిష్టగిరి గ్రామాల్లో మహాకూటమి నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కోరారు. పాలన చేతకాక ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్‌కు భంగపాటు తప్పదన్నారు.
ఈ ఎన్నికల్లో అధిక మెజార్టీతో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రైతులందరికీ పంట రుణమాఫీ, బీమా సౌకర్యం, పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని భరోసా ఇచ్చారు. జెడ్పీటీసీ వెంకటయ్య యాదవ్, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి, మాజీ సర్పంచ్ జానకి కొండన్న, సహదేవ్ యాదవ్, మాసిరెడ్డి, తిరుపతయ్య, జనార్దన్ పాల్గొన్నారు.
ఖిల్లాఘనపురం: వనపర్తి నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యేగా 20 ఏళ్లపాటు పనిచేసి ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టిన తన తండ్రి ఏనాడూ అవినీతి, అక్రమాలకు అవకాశం ఇవ్వలేదని, ఆయనంటే ప్రజలకు ఓ నమ్మకమని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి కుమారుడు ఆదిత్యారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని మామిడిమాడ, ముందలితండా, వెనికితండాల్లో ఆయన మండల సింగల్‌విండో అధ్యక్షుడు రవిందర్‌రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, నాయకులు బాలకృష్ణారెడ్డి తదితరులతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు.
ఇంటింటికీ వెళ్లి చేతిగుర్తుకు ఓటువేసి చిన్నారెడ్డిని గెలిపించాలని కోరారు. సీఎం కేసీఆర్ మోసపూరిత హామీలు ఏ ఒక్కటీ నెరవేరలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగుల కోసం మెగా డీఎస్సీ వేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు పోల్‌శెట్టి శ్రీను, బండారి శ్రీను, బండారి యాదయ్య, డాక్టర్ నరేందర్‌గౌడ్, నాగేశ్వర్, కృష్ణయ్య యాదవ్, జయాకర్, బాల్‌రాజు, దేవిజానాయక్, గోవింద్‌నాయక్, రాజు, మాసయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment