
శంకుస్థాపన చేస్తున్న నిరంజన్‌రెడ్డి, చిన్నారెడ్డి
వనపర్తి/పెద్దమందడి(ఖిల్లాఘనపురం): జూన్ నాటికి వనపర్తి నియో జకవర్గంలో 1400 డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయడం జరుగుతుందని 2019 ఎన్నికల నాటికి మరో 2వే ల ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలం లోని మంగంపల్లిలో ఎమ్మెల్యే చిన్నారెడ్డితో కలిసి డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. గ్రామానికి 20ఇళ్లు మంజూరయ్యాని తెలిపారు. అవసరమై న ప్రతి గ్రామానికి మంజూరు చేస్తామన్నారు.
నిరుపేదల కోసం నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణాలు నాణ్యతతో, సకాలంలో నిర్మించి ఇవ్వాలని ఎమ్మెల్యే చిన్నారెడ్డి తెలిపారు. అవసరమైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం ఇళ్లు మం జూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ దయా కర్, ఖిల్లాఘనపురం వైస్ ఎంపీపీ ఉమామహేశ్వరి, కాంగ్రెస్ జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి గిరిజాదేవి, నాయకులు సత్యారెడ్డి, బుచ్చిలింగం, రవీందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయ కులు మేఘారెడ్డి, సర్పంచ్ శ్రీలత, సింగల్‌విండో అధ్యక్షుడు విట్టా శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment