నిరంజన్‌రెడ్డిని సన్మానిస్తున్న జర్నలిస్టులు
వనపర్తి : జిల్లాలో అర్హత ఉన్న జర్నలిస్టులు అందరికీ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేస్తుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. జర్నలిస్టుల పిల్లలకు ఉచితవిద్య అందించాలని డీఈఓ జారీచేసిన ప్రొసీడింగ్ ప్రతుల పంపిణీ కోసం టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆ«ధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొదట గోపాల్‌పేట, పెబ్బేరు మండలాల నుంచి డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపును ప్రారంభించి అన్ని మండలాలతో పాటు జిల్లా కేంద్రంలోనూ రెండు విడతల్లో మంజూరు చేస్తామన్నారు. అన్ని మండల కేంద్రాల్లో ప్రెస్‌క్లబ్ భవన నిర్మాణాల కోసం రూ.ఐదులక్షల చొప్పున మంజూరు చేయిస్తానని చెప్పారు. జిల్లా కేంద్రంలో ప్రెస్‌క్లబ్ నిర్మాణం కోసం రూ.10లక్షలు మంజూరు చేయిస్తానని అన్నారు.
విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రైవేట్ విద్యాలయంలో బీపీఎల్ కుటుంబాలకు ఇవ్వాల్సిన ఉచితసీట్లను జర్నలిస్టుల పిల్లలతో భర్తీచేసేలా విద్యాశాఖ అధికారులతో మాట్లాతానని చెప్పారు. అనంతరం విలేకరులు నిరంజన్‌రెడ్డిని సన్మానించారు. టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు జి.మధుగౌడ్, మున్సిపల్ చైర్మన్ పలుస రమేష్‌గౌడ్, ఎంపీపీ శంకర్‌నాయక్, మార్కెట్ చైర్మన్ బుచ్చిరెడ్డి, కౌన్సిలర్ శ్రీధర్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రశాంత్, రవిందర్‌రెడ్డి, నాగేంద్రం ఆచారి, కొండన్న, యాకూబ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment