
'తలసాని బ్లాక్‌మెయిలర్'
సాక్షి, హైదరాబాద్: ‘దున్నపోతుల వెంట తిరుగుతున్న తలసానికి దున్నపోతుల భాషే వస్తుంది. ఆయన రాజకీయ బతుకేందో అందరికీ తెలుసు. బ్లాక్‌మెయిర్లకు బ్రాండ్ అంబాసిడర్ తలసాని. చంద్రబాబును, నన్ను విమర్శించే ముందు ఆధారాలు చూపాలి. చిల్లర మల్లర రాజకీయాలు చేసి కేసీఆర్ కుటుంబం మెప్పు పొందాలని చూస్తున్నాడు. మతిభ్రమించి మాట్లాడుతున్న ఆయన పదవి ఊడడం ఖాయం.
అప్పుడు మళ్లీ మా దగ్గరి కొచ్చి బతిమిలాడితే టీడీపీ ఆఫీసు ముందు గూర్ఖాలాగా నిలబెడతాం’ అని టీడీఎల్‌పీ ఉప నేత ఎ.రేవంత్‌రెడ్డి మంత్రి తలసానిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఎన్‌టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘సనత్‌నగర్‌లో ఆయనమీద చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పోటీ చేయాలా? అయినా శాసనసభకు పక్క రాష్ట్రం వాళ్లు పోటీ చేయరనే విషయం కూడా తెలి యని సన్నాసి. పార్టీ కార్యకర్తను నిలబెడతాం. గెలవమనండి చూద్దాం’ అని పేర్కొన్నారు.