తెలంగాణ బడ్జెట్పై సీఎం సంతృప్తి | cm kcr expresses satisfaction over state budget | Sakshi
Sakshi News home page

తెలంగాణ బడ్జెట్పై సీఎం సంతృప్తి

Published Wed, Mar 11 2015 6:21 PM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

తెలంగాణ బడ్జెట్పై సీఎం సంతృప్తి - Sakshi

తెలంగాణ బడ్జెట్పై సీఎం సంతృప్తి

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్పై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల సందర్భంగా తాము మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలుచేసేందుకు వీలుగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయన్నారు. అన్ని రంగాలకు న్యాయం చేస్తూ, సరైన నిధులను కేటాయిస్తూ సమతుల్యత పాటించారని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్పై ప్రశంసలు కురిపించారు.

సంక్షేమం, వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా ఈ బడ్జెట్ ఉందన్నారు. చెరువుల పునరుద్ధరణ, రహదారుల అభివృద్ధి, వాటర్ గ్రిడ్ పథకాలకు సముచిత ప్రాధాన్యం దక్కిందని కేసీఆర్ తెలిపారు. మంచి బడ్జెట్ను రూపొందించారని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ను, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement