ప్రణాళికాబద్ధంగానే ముందుకు : కేసీఆర్
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. శనివారం శాసనమండలిలో ఆయన ప్రభుత్వ పథకాలను వివరించారు. దేశంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయని, కేంద్రం ప్లానింగ్ కమిషన్ స్థానంలో నీతి ఆయోగ్ పథకం తెచ్చిందన్నారు.
నిబంధనలు పెట్టకుండా కేంద్రం నిధులు విడుదల చేయాలని కేసీఆర్ కోరారు. రాష్ట్రంలో ఉన్న 122 పథకాలను 66 పథకాలు చేయనున్నట్లు కేసీఆర్ తెలిపారు. గతంలో రాష్ట్రాలు అంటే చాలా చిన్న చూపు ఉండేదన్నారు. గత ప్రభుత్వాల హయాంలో కేంద్రం నిధులు దుర్వినియోగం అయ్యాయన్నారు. రాష్ట్రాలకు రుణపరిమితిని కూడా కేంద్రం పెంచిందన్నారు.