
తెలంగాణ అసెంబ్లీ శుక్రవారానికి వాయిదా
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ప్రసంగం అనంతరం స్పీకర్ మధుసూదనాచారి సభలో
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ప్రసంగం అనంతరం స్పీకర్ మధుసూదనాచారి సభలో ఎల్లుండికి వాయిదా వేశారు. అంతకు ముందు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుందన్న ఈటెల రాజేందర్ 2015-16 బడ్జెట్ను రూ.1,10,500 కోట్లతో ప్రవేశపెట్టారు. ఆయన సుమారు గంటపాటు బడ్జెట్ ప్రసంగాన్ని చదవి వినిపించారు.