ఉద్యోగుల జీతాలకు రూ. 20 వేల కోట్లు | Employee wages of Rs. 20 thousand crore | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల జీతాలకు రూ. 20 వేల కోట్లు

Published Thu, Mar 12 2015 4:51 AM | Last Updated on Mon, Mar 25 2019 3:09 PM

Employee wages of Rs. 20 thousand crore

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2014-15 ఆర్థిక సంవత్సరానికి చెల్లిస్తున్న మొత్తం ఎంతో తెలుసా? అక్షరాలా 16,965.33 కోట్లు. మరి ఉద్యోగులకు ఇటీవలే వేతన సవరణ స్కేళ్లను అమలు చేయాలని నిర్ణయించినందున వచ్చే ఆర్థిక సంవత్సరానికి చెల్లించే మొత్తం ఎంత ఉంటుందని అనుకుంటున్నారా? ఆ మొత్తం 20,045.23 కోట్లు. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే ఇది రూ. 3379.3 కోట్లు అధికం. జీతాలు సరే పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు చెల్లించే పింఛన్లు కూడా వేల కోట్లలోనే పెరిగాయి. మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం రూ. 6580.46 కోట్లు ఉంటే వచ్చే ఏడాదికి అంటే 2015-16కు అది రూ. 8,235.87 కోట్లు అవుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులపై చెల్లించే వడ్డీ ఎంత అనుకుంటున్నారు? ఈ నెల 31తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి రూ. 5925.06 కోట్లుకాగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి అది రూ. 7554.91 కోట్లు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement