తెలంగాణ కొత్త రాష్ట్రంలో పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌లో అంకెలు మారాయి. జిల్లాలోదీర్ఘకాలికంగా కొనసా గుతున్న సాగునీటి ప్రాజెక్టులకు
తెలంగాణ కొత్త రాష్ట్రంలో పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌లో అంకెలు మారాయి. జిల్లాలోదీర్ఘకాలికంగా కొనసా గుతున్న సాగునీటి ప్రాజెక్టులకు అటూఇటూగా మంత్రి ఈటెల రాజేందర్ అంకెలు మార్చి బడ్జెట్‌లో చూపెట్టారు. కొన్ని ప్రాజెక్టులకు నిధులు ఈసారి పెరిగితే, మరికొన్ని ప్రాజెక్టులకు తగ్గాయి. ఇంకొన్ని ప్రాజెక్టులపై ఎప్పటిలాగే ఈ బడ్జెట్ కూడా శీతకన్ను వేసింది.
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో కొత్తగా రెండు సాగునీటి ప్రాజెక్టులను ప్రతిపాదించిన ఆర్థిక మంత్రి వాటికి నిధులు మాత్రం చూపెట్టలేదు. అదే విధంగా దామరచర్ల పవర్‌ప్లాంటు గురించి ప్రత్యేక ప్రస్తావన లేకపోయినా, ఆ ప్రాజెక్టును బీహెచ్‌ఈఎల్‌తో కలిసి చేపడతామని తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పుకొచ్చారు. బీబీనగర్‌మండలం రంగాపూర్ నిమ్స్ అృవద్ధికి రూ.34కోట్లు చూపెట్టడంతో పాటు గత ఏడాదిలాగే యాదగిరిగుట్ట డెవలప్‌మెంట్ అథారిటీకి మరో రూ.100 కోట్లు కేటాయించారు. అదే విధంగా హైదరాబాద్ - వరంగల్ ఇండస్ట్రీయల్ కారిడార్, అంగన్‌వాడీల వేతనాల పెంపు, పోలీస్‌స్టేషన్ల నిర్వహణకు నిధుల కేటాయింపు లాంటి ఊరడింపులతో పాటు పిలాయిపల్లి, బునాదిగానికాల్వల పేర్లు కూడా ఈసారి బడ్జెట్‌లో లేకపోవడం, ఫ్లోరిన్ నివారణ కార్యక్రమాన్ని కేవలం వాటర్‌గ్రిడ్‌తో సరిపెట్టడం లాంటి నిరాశాజనక అంశాలూ ఈసారి బడ్జెట్‌లో కనిపించాయి.
‘సా....గు నీరేనా’?
జిల్లాలో ఉన్న భారీ, మధ్యతరహా, చిన్న నీటి ప్రాజెక్టులకు కేటాయింపులు చూస్తే ఈ ప్రాజెక్టులు ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదు.
చిన్ననీటి ప్రాజెక్టులకు మొండిచేయి..
జిల్లాలోని చిన్ననీటి ప్రాజెక్టులయిన డిండి, ఆసిఫ్‌నహర్, మూసీ ప్రాజెక్టులకు ఎప్పటిలాగేఈసారి కూడా మొండిచేయే చూపెట్టారు. డిండికి రూ.30లక్షలు, ఆసిఫ్‌నహర్‌కు రూ.80 లక్షలు, మూసీ ప్రాజెక్టు రూ.1కోటి చూపెట్టారు. ఇక, జిల్లాలోని దాదాపు 52వేల ఎకరాలకు సాగునీరందించే చొక్కారావు-దేవాదుల ఎత్తిపోతల పథకానికి రూ.388 కోట్లు కేటాయించిన నేపథ్యంలో ఈ ఏడాది ఈ ప్రాజెక్టు పూర్తికావచ్చనేది అంచనా. ఇక, జూరాల - పాకాల ప్రాజెక్టు సర్వే కోసంగత ఏడాది రూ.5 కోట్లు కేటాయించగా, ఈసారి దానిని రూ.3. 63 కోట్లకు తగ్గించారు. ఇక, జిల్లాలో తాగు, సాగునీటి కోసం రెండు కొత్త ప్రాజెక్టులను ప్ర కటిస్తున్నామని చెప్పారు ఈటెల రాజేం దర్. అందులో పాలమూరు ఎత్తిపోతల ఒకటి కా గా, నక్కల గండి ప్రాజెక్టు కింద 51టీఎంసీల సామర్థ్యం కల రెండు రిజర్వాయర్లను నిర్మిస్తామనడం మరోటి. అయితే, ఈ ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పినా, వీటికి ప్రత్యేక కే టాయింపులు చూపెట్టకపోవడం గమనార్హం.
గత నాలుగేళ్లలో జిల్లాలోని భారీ సాగునీటి ప్రాజెక్టులకు
కేటాయింపులివి: (రూ.కోట్లలో)
ప్రాజెక్టు 2012-13 2013-14 2014-15 2015-16
నాగార్జునసాగర్ 700 700 425 210
ఎస్‌ఎల్‌బీసీ 451 420 325 599
ఎస్సారెస్పీ-2 74 40 25 23