
రైతు ఆత్మహత్యలు అరవై తొమ్మిదే!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన రైతు ఆత్మహత్యలు 69 మాత్రమేనని, అలా విగతజీవులైన 55 మంది రైతుల కుటుంబాలకు జీవో 421 ప్రకారం ఒక్కో కుటుంబానికి రూ.లక్ష వంతున ఎప్పటికప్పుడు ఆర్థికసాయం అందిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన రైతు ఆత్మహత్యలు 69 మాత్రమేనని, అలా విగతజీవులైన 55 మంది రైతుల కుటుంబాలకు జీవో 421 ప్రకారం ఒక్కో కుటుంబానికి రూ.లక్ష వంతున ఎప్పటికప్పుడు ఆర్థికసాయం అందిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. సోమవారం శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు షబ్బీర్‌అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి రైతుఆత్మహత్యలపై లేవనెత్తిన ప్రశ్నకు పోచారం జవాబిచ్చారు. మంత్రి మాట్లాడుతూ.. ఆత్మహత్యలు చేసుకున్నవారిలో మహబూబ్‌నగర్ జిల్లాలో 13, రంగారెడ్డిలో11, అదిలాబాద్‌లో 9, కరీంనగర్‌లో7, మెదక్ జిల్లాలో 29 రైతులు ఉన్నట్లు తెలిపారు. బాధిత కుటుంబాల పిల్లలకు సంక్షేమ పాఠశాలలు, హాస్టళ్లలో ప్రవేశాలు కల్పిస్తున్నామని, ఐఏవై కింద గృహాల కేటాయింపు, వివిధ ప్రభుత్వ పథకాల కింద ఆర్థిక మద్ధతు ఇస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 500ల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వారి కుటుంబాలన్నింటినీ ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు.
భర్తీకాని టీచర్ పోస్టులు డి-రిజర్వ్: కడియం
- ఉర్దూ మాధ్యమంలో టీచర్ పోస్టులకు ఎస్సీ,ఎస్టీ,బీసీ కేటగిరీల నుంచి అభ్యర్థులు కరువవడంతో.. మిగిలిపోతున్న పోస్టులను డి-రిజర్వ్ చేసి ఓపెన్ కేటగిరీలో నియమాకాలు చేస్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రకటించారు.
- హైదరాబాద్‌లో రైల్వే క్రాసిం గ్‌లున్న 94 ప్రాంతాల్లో ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలు అవసరమని భావిస్తున్నామని మంత్రి తుమ్మల తెలిపారు. ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి ప్రశ్నకు జవాబిచ్చారు.
- రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ 75వేల జ నాభాకు ఒక 108 అంబులెన్స్ ఉండేలా చూస్తామని ఆరోగ్యమంత్రి లకా్ష్మరెడ్డి తెలిపారు. సభ్యులు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, షబ్బీర్ అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిచ్చారు.
- అదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల గుండా వెళుతున్న 4 జాతీయ రహదారులను నాలుగులేన్లుగా మార్చినట్లు ఎమ్మెల్సీ ఆమోస్ ప్రశ్నకు మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు సమాధానమిచ్చారు.
- నవంబరు కల్లా జైపూర్ విద్యుత్
- అదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్ సమీపంలోని జైపూర్ విద్యుత్‌ప్లాంట్‌ను వచ్చే నవంబరు కల్లా ప్రారంభించబోతున్నట్లు విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు తెలపాలని ఎమ్మెల్సీ వెంకటరావు కోరగా ఈ ప్లాంట్‌లోని రెండు యూనిట్లు పూర్తయితే విద్యుదుత్పత్తి సామర్థ్యం 700 మెగావాట్లు కానుందన్నారు.
రైతు ఆత్మహత్యలు 97
హైదరాబాద్: తెలంగాణలో 97మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి గత నెల చివరినాటికి ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య ఇదేనని వెల్లడించింది. ఐదు జిల్లాల్లోనే ఆత్మహత్యలు జరిగాయని.. నాలుగు జిల్లాల్లో ఒక్కఆత్మహత్య కూడా జరగలేదని స్పష్టం చేసింది. ఆదిలాబాద్ జిల్లాలో 16 మంది, కరీంనగర్‌లో 12, మహబూబ్‌నగర్‌లో 20, మెదక్‌లో 36, రంగారెడ్డి జిల్లాలో 13 మంది ఆత్మహత్య చేసుకున్నారని వ్యవసాయశాఖ కమిషనర్ ప్రియదర్శిని ‘సాక్షి’కి చెప్పారు. మిగిలిన జిల్లాల్లో ఒక్క ఆత్మహత్య కూడా జరగలేదన్నారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాల్లో 65 మందికి ఇప్పటికే ఎక్స్‌గ్రేషియా అందించారని ఆమె చెప్పారు.