హైదరాబాద్: సంప్రదాయానికి భిన్నంగా తెలంగాణ వార్షిక బడ్జెట్‌కు ఈసారి ఒక రోజు ముందే రాష్ట్ర కేబినేట్ ఆమోదం తెలపనుంది. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బుధవారం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
బడ్జెట్‌కు నేడు కేబినెట్ ఆమోదం
Published Tue, Mar 10 2015 2:52 AM | Last Updated on Sat, Sep 2 2017 10:33 PM
హైదరాబాద్: సంప్రదాయానికి భిన్నంగా తెలంగాణ వార్షిక బడ్జెట్‌కు ఈసారి ఒక రోజు ముందే రాష్ట్ర కేబినేట్ ఆమోదం తెలపనుంది. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బుధవారం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆనవాయితీ ప్రకారం అదే రోజు ఉదయం రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై బడ్జెట్‌ను ఆమోదిస్తుంది. ఆ వెంటనే గవర్నర్‌కు పంపించి ఆయన ఆమోద ముద్ర తర్వాత సభలో ప్రవేశపెడుతుంది. కానీ.. ఈసారి ఒక రోజు ముందే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను నిర్వహిస్తోంది. బడ్జెట్‌కు ఆమోదం తెలిపేందుకు మంగళవారం సాయంత్రం కేబినెట్ భేటీ అవనుంది. ఆ వెంటనే గవర్నర్‌కు పంపించి సభలో ప్రవేశపెట్టేందుకు అనుమతి తీసుకోనుంది. బుధవారం గవర్నర్ స్థానికంగా అందుబాటులో ఉండే అవకాశం లేదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Advertisement
Advertisement