టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్ లో కొత్తదనం ఏమీ లేదని టీడీపీ నేత అరికెల నర్సారెడ్డి పెదవి విరిచారు.
హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్ లో కొత్తదనం ఏమీ లేదని టీడీపీ నేత అరికెల నర్సారెడ్డి పెదవి విరిచారు. పాత పథకాలకే కొత్త పేర్లు ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చెరువుల అభివృద్ధి కోసం చేపట్టిన మిషన్ కాకతీయ పథకం కొత్తది కాదన్నారు. దీని ద్వారా అదనంగా ఒక్క టీఎంసీ నీళ్లు కూడా రావని చెప్పారు.
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రయత్నం చేస్తున్నామని చెప్పకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వ తీరు చూస్తుంటే ఈ ప్రాజెక్టును ఎత్తివేస్తారనే భయం కలుగుతోందన్నారు. పంచదార పరిశ్రమల గురించి ప్రస్తావించలేదన్నారు.